పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. సలార్, కల్కి 2898AD, మారుతీ మూవీ ఇలా మూడు సినిమాలు ఏక కాలంలో రూపొందుతున్నాయి.అవి కూడా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌లు గా రూపొందుతున్నాయి . ఇక ఈ మూడు సినిమాలు పూర్తయిన తర్వాత ప్రభాస్ సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాత హను రాఘవపూడి తో ఓ సినిమా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంది. కాగా ఈ లిస్ట్ లోకి మరో స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూడా జాయిన్ అయ్యారు. హాలీవుడ్ రేంజ్ లో ఒక సినిమాటిక్ యూనివర్స్‌ను క్రియేట్ చేసిన ఘనత లోకేష్ కనగరాజ్ కు మాత్రమే దక్కుతుంది..ఆయన మొదటి సినిమా నగరం నుంచి మొదలుకుని విక్రమ్ వరకు ప్రతీది లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగం గా తెరకెక్కినవే. అయితే విజయ్‌తో చేసిన ఒక్క మాస్టర్ మినహాయించి మిగిలిన మూడు సినిమాలు కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో తెరకేక్కినవే..
ఇక ఇప్పుడు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న లియో కూడా LCU లో భాగంగా తెరకెక్కినట్లు సమాచారం.. కాగా ఈ దర్శకుడు తన కెరీర్ లో కేవలం 10 సినిమాలు మాత్రమే చేస్తానని, ఆ తర్వాత డైరెక్షన్ పక్కన పెట్టేసి ప్రొడ్యూసర్‌గా, రైటర్‌గా ఫిక్స్ అయిపోతానని ఎన్నో ఇంటర్వూల్లో తెలిపాడు.కాగా తాజాగా లోకేష్ లియో ప్రమోషన్‌లో భాగం గా తన నెక్ట్స్ లైనప్ గురించి చెప్పాడు. అందులో ప్రభాస్‌తో కూడా సినిమా చేస్తున్నట్లు ఆయన చెప్పాడు. అంతేకాకుండా ప్రభాస్‌తో చేయబోయేది LCU లో ఎండ్ గేమ్ అని కూడా తెలిపాడు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో సంతోషంగా వున్నారు.చివరి సినిమా ప్రభాస్ తో ముగిస్తాడు అంటే అది ఏ రేంజ్‌లో ఉండబోతుందోనని ప్రభాస్ ఫ్యాన్స్ ఉహించుకుంటున్నారు.అయితే ఈ మూవీ తెరకేక్కడానికి చాలా టైం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
