Site icon NTV Telugu

Lokesh Kanagaraj : త్వరలోనే రోలెక్స్ చిత్రాన్ని తెరకెక్కించనున్న స్టార్ దర్శకుడు..?.

Whatsapp Image 2023 08 13 At 8.43.07 Pm

Whatsapp Image 2023 08 13 At 8.43.07 Pm

తమిళ యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆయన ఇప్పటి వరకు తీసిందే కేవలం ఆరు సినిమాలే అయినా కూడా బాగా పాపులర్ అయ్యారు. ఖైదీ, మాస్టర్ వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు.అలాగే గత సంవత్సరం విశ్వ నటుడు కమల్ హాసన్‍ హీరోగా తెరకెక్కించిన విక్రమ్ సినిమాతో లోకేశ్ స్టార్ డైరెక్టర్ గా మారారు.. విక్రమ్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను సాధించింది. కమల్ హాసన్‍కు అదిరిపోయే కమ్‍బ్యాక్ మూవీ గా నిలిచింది.అయితే, విక్రమ్ సినిమా క్లైమాక్స్ లో తమిళ స్టార్ హీరో సూర్య ‘రోలెక్స్’ అనే క్యామియో పాత్రలో కనిపించారు.సినిమాలో రోలెక్స్ పాత్ర ఉన్నది కాసేపే అయినా కూడా ఆ క్యారెక్టర్ అందరికీ తెగ నచ్చేసింది.ఈ పాత్రలో సూర్య తన అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో అదరగొట్టాడు. ఈ పాత్ర ఇంత అద్భుతంగా రావడానికి లోకేశ్ వైలెంట్ టేకింగ్ మరో కారణంగా చెప్పొచ్చు.

లోకేశ్ కనగరాజ్ తనకు ఓ సింగిల్ లైన్ స్క్రిప్ట్ ను చెప్పారని హీరో సూర్య ఇటీవల ఒక ఈవెంట్లో చెప్పారు. అయితే, ఇది ‘రోలెక్స్’ సినిమా గురించే అని ఒక వార్త వైరల్ అవుతుంది.విక్రమ్ మూవీలో ‘రోలెక్స్’ క్యామియోకు అదిరిపోయే రెస్పాన్స్ రావటంతో ఆ క్యారెక్టర్ ప్రధాన పాత్రగా సినిమాను తెరకెక్కించే ప్లాన్‍లో లోకేశ్ కనగరాజ్ ఉన్నాడని సమాచారం.అయితే, ప్రస్తుతం ఈ చిత్రం ఇంకా చర్చల దశలోనే ఉంది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం లోకేష్ దళపతి విజయ్‍తో చేస్తున్న లియో చిత్రానికి కూడా విక్రమ్, ఖైదీతో కాస్త లింక్ ఉంటుందని సమాచారం.ప్రస్తుతం తెరకెక్కుతున్న లియో సినిమా ఈ ఏడాది అక్టోబర్ 19 న విడుదల కానుంది.. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్‍గా నటిస్తున్నారు.. అలాగే విజయ్ దళపతి సరసన స్టార్ హీరోయిన్ త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version