Site icon NTV Telugu

Lokesh kanagaraj : కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన స్టార్ డైరెక్టర్..

Whatsapp Image 2023 11 27 At 7.59.33 Pm

Whatsapp Image 2023 11 27 At 7.59.33 Pm

లోకేష్ కనగరాజ్.. ఈ స్టార్ డైరెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ తమిళ దర్శకుడు తెరకెక్కించింది కేవలం 5 చిత్రాలు మాత్రమే..అతి తక్కువ సమయంలోనే తమిళ్ స్టార్ డైరెక్టర్ గా ఎదగడంతో పాటు భారీ పారితోషికంతో ఆయన తమిళ చిత్రసీమలో సంచలనం సృష్టిస్తున్నారు. ‘లోకేష్‌ కనకరాజ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌’లో భాగంగా వచ్చిన ‘ఖైదీ’మరియు ‘విక్రమ్‌’ చిత్రాలు చక్కటి ప్రేక్షక ఆదరణ సొంతం చేసుకున్నాయి. గ్యాంగ్‌స్టర్‌ డ్రామాలను ఎంతో అద్భుతంగా రూపొందిస్తూ ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరు పొందారు లోకేష్‌ కనకరాజ్‌.రీసెంట్ గా లోకేష్ కనగరాజ్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి తో తెరకెక్కించిన ‘లియో’ సినిమా దసరా కానుక గా అక్టోబర్ 19 న విడుదల అయి అద్భుత విజయం సాధించింది. ఈ సినిమా కూడా ఖైదీ, విక్రమ్ సినిమాలు లాగానే సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా లోకేష్‌ కనకరాజ్‌ తెరకెక్కించారు.. కానీ ఈ సినిమాకు మొదట్లో మిక్స్డ్ టాక్ వచ్చింది.. కానీ వసూళ్ల పరంగా ఈ సినిమా కమర్షియల్ విజయం సాధించింది..

లియో సినిమా తర్వాత లోకేష్ రజనీకాంత్‌ 171వ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు.ఈ సినిమాకు లోకేష్‌ కనకరాజ్‌ దాదాపు 60కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకోబోతున్నారని తెలిసింది. తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ ప్రస్తుతం తలైవా 170 సినిమాతో బిజీ గా వున్నారు..గతంలో లోకేష్ తాను కేవలం 10 సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహిస్తాను అని ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ చెప్పాడు. కానీ ఆ 10 సినిమాలు గుర్తుండి పోయేవిధంగా తెరకేక్కిస్తాను అని గతంలో తెలిపాడు..తాజాగా లోకేష్ కనగరాజ్ కు సంబంధించి సంబంధించిన ఆసక్తికర వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.లోకేష్ కనగరాజ్ సొంతంగా నిర్మాణ సంస్థ ను ప్రారంభిస్తున్నట్లు తాజాగా ప్రకటించారు..” G Squd” పేరు తో సినిమాలు నిర్మించనున్నట్లు తాజాగా ప్రకటించారు.తమిళంలో స్టార్ హీరోలతో సినిమాలు చేసి స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న లోకేష్ ఇప్పుడు నిర్మాత అవతారం ఎత్తుతున్నారు..మరిన్ని మంచి కథలు చెప్పడంతో పాటు వినోదాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రొడక్షన్ వెంచర్ మొదలు పెట్టినట్లు ఆయన వెల్లడించారు

Exit mobile version