Site icon NTV Telugu

Thalaivar 171 : ‘తలైవా 171’ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన లోకేష్ కనగరాజ్..

Whatsapp Image 2024 03 26 At 11.59.35 Am

Whatsapp Image 2024 03 26 At 11.59.35 Am

తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ గత ఏడాది విడుదల అయిన జైలర్ సినిమాతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు. జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో తలైవా ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.. ఇప్పటికే రజినీ ‘వెట్టయ్యాన్’ సినిమా చేస్తుండగా..ఈ చిత్రానికి జై భీమ్‌ ఫేం టీజే జ్ఞానవేళ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపు 70 శాతంకి పైగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ చిత్రం అనంతరం రజినీకాంత్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ తో ‘తలైవా 171’ మూవీ చేయనున్నాడు. ఖైదీ, విక్రమ్‌, లియో లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను ఇండస్ట్రీకి అందించిన లోకేశ్‌ కనగరాజ్,రజినీకాంత్‌ కాంబోలో సినిమా రాబోతుండడంతో ఎలా ఉండబోతుందోనని అంతా ఎంతో ఎక్జయిటింగ్‌గా ఎదురు చూస్తున్నారు.. ఇదిలావుంటే ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించి తాజా అప్‌డేట్ వచ్చింది.

తాజాగా ఒక ఇంటర్వ్యులో పాల్గోన్న లోకేష్.. తలైవా 171 గురించి మాట్లాడుతూ.. రజనీకాంత్‌తో కలసి వర్క్‌ చేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. తలైవా 171 నాకెంతో ప్రత్యేకమైనది. షూటింగ్‌ మొదలుపెట్టడానికి, ప్రీప్రొడక్షన్ వర్క్‌ పూర్తి చేయడానికి కొంత సమయం పడుతుంది. జూన్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి. ఏడాదిన్నరలో ఈ సినిమా పూర్తి చేసి ఆ తర్వాత ‘ఖైదీ 2’ సినిమాను మొదలుపెడతాను అంటూ లోకేష్ వెల్లడించాడు. ఈ చిత్రాన్ని లీడింగ్‌ ప్రొడక్షన్‌ హౌజ్‌ లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తోండగా.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నాడు.అయితే ఇటీవల రజనీకాంత్ గెస్ట్ లో నటించిన ‘లాల్ సలామ్’ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీని రజనీకాంత్ తనయ ఐశ్వర్య రజనీకాంత్ తెరకెక్కించింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేదు. దీనితో రజనీ అప్ కమింగ్ మూవీస్ పైనే ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.

Exit mobile version