Lokesh : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. `ఖైదీ`లోకేష్ కనగరాజ్ తర్వాత పాన్ ఇండియాలో సంచలనమైన సంగతి తెలిసిందే. `ఖైదీ`తో ఎల్ సీయూని పరిచయం చేసి తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటూ దూసుకువెళ్తున్నాడు. ఎల్ సీయూ నుంచి మరిన్ని సినిమాలు వస్తాయని.. వచ్చే ఐదేళ్లకు తగ్గ ప్రణాళిక తన దగ్గర ఉందని రివీల్ చేశారు. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ తో చేస్తోన్న `కూలీ` చిత్రం మాత్రం ఎల్ సీయూ నుంచి రావడం లేదు. ఇది డిఫరెంట్ కథ. ఇందులో రజనీకాంత్ గోల్డ్ స్మగ్లర్ పాత్రలో కనిపించనున్నారు. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంతోనూ కథ ముడిపడి ఉంది. అయితే ఇది మసాలా కమర్షియల్ సినిమా కాదని లోకేష్ గట్టిగా చెబుతున్నారు. లాజికల్ గా సాగే ఓ సెన్సిబుల్ కమర్షియల్ సినిమాగా ఉంటుందని డైరెక్టర్ కనగరాజ్ తెలిపాడు. అంటే ఈ సినిమా సూపర్ స్టార్ మాస్ ఇమేజ్‌కి.. ఎలివేషన్లకు దూరంగా ఉండే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. పూర్తిగా లోకేష్ మార్క్ హీరోని మాత్రమే సినిమాలో హైలైట్ చేస్తాడు.
Read Also:Russia – Ukraine Conflict: తమపై యుద్ధానికి వచ్చిన కిమ్ సైనికులు చనిపోయారు..
అలాగని వాళ్ల మాస్ ఫాలోయింగ్‌ని పూర్తిగా వదిలినట్లు కాదు. ఆ అంశాన్ని అక్కడక్కడ టచ్ చేస్తూనే హీరోని తన దారిలోకి తెచ్చుకుని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు లెక్క. తన గత సినిమాల్లో లాగా అంటే `ఖైదీ`, `విక్రమ్`, `లియో` ని పరిశీలిస్తే హీరోలకు అవనసరమైన బిల్డప్ సీన్లు ఎక్కడా ఉండవు. ఎలివేషన్లు అసలే ఉండవు. ప్రతి సన్నివేశం ఎంతో లాజిక్‌గా ఉంటుంది. సన్నివేశంలో పాత్ర ఉన్నట్లు ఉంటుంది తప్ప పాత్రలో సన్నివేశం ఉన్నట్లు ఉండదు. లోకేష్ కనగరాజ్ అదే ఫార్మాట్లో కూలీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇలా స్టార్ హీరోలని ఒప్పించడం అంటే చిన్న విషయం కాదు. తమకున్న మాస్ ఫాలోయింగ్, ఫ్యాన్స్ లో క్రేజ్, మాస్ ఎలివేషన్లు అంటూ హీరోలు హడావుడి చేస్తారు. అందులోనూ రజనీకాంత్ తో సినిమా అంటే అలాంటి ఎలివేషన్లు లేకుండా చేయడం అంటే కత్తిమీద సాము లాంటిదే.. చూడాలి లోకేష్ కూలీలో ఎలాంటి ప్రయోగం చేసిన చూపిస్తాడో.