Site icon NTV Telugu

Lok Sabha Election Results 2024 LIVE UPDATES: సార్వత్రిక ఎన్నికల ప్రజాతీర్పు.. లైవ్ అప్‌డేట్స్‌

Lok Sabha Elections 2024

Lok Sabha Elections 2024

Elections Results 2024: దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా చూస్తున్న రోజు రానే వచ్చింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు జరిగిన ఏడు విడతల జరిగిన ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. దేశంలోని మొత్తం 543 స్థానాల్లో 8360 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరి భవితవ్యం ఈ రోజుతో తేలిపోనుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఈ సారి కూడా అధికారంలోకి వస్తుందని, 350కి పైగా సీట్ల సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తుండగా, ఇండియా కూటమి తామే అధికారంలోకి వస్తామని, ఎగ్జిట్ పోల్స్ తారుమారు అవుతాయని, తాము 295 సీట్లను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేసింది. బీజేపీ స్వయంగా 370కి పైగా స్థానాలను, ఎన్డీయే కూటమి 400+ స్థానాలను గెలుచుకుంటుందని ఆ పార్టీ ఎన్నికల ముందు నుంచి చెబుతోంది.

 

The liveblog has ended.
  • 09 Jun 2024 03:05 PM (IST)

    ప్రధాని మోదీతో సహా మంత్రులుగా ప్రమాణం చేయబోయే అవకాశం ఉన్న వారి జాబితా ఇదే:

    అమిత్ షా - బీజేపీ
    రాజ్‌నాథ్ సింగ్ - బీజేపీ
    నితిన్ గడ్కరీ - బీజేపీ
    జ్యోతిరాదిత్య సింధియా - బీజేపీ
    అర్జున్ రామ్ మేఘవాల్ - బీజేపీ
    రక్షా ఖడ్సే - బీజేపీ
    జితేంద్ర సింగ్ - బీజేపీ
    కిరణ్ రిజుజు - బిజెపి
    మన్సుఖ్ మాండవియా - బీజేపీ
    అశ్విని వైష్ణవా - బీజేపీ
    హర్దీప్ పూరి - బీజేపీ
    జి కిషన్ రెడ్డి - బిజెపి
    హర్దీప్ సింగ్ పూరి - బీజేపీ
    శివరాజ్ సింగ్ చౌహాన్ - బీజేపీ
    రావ్ ఇంద్రజిత్ సింగ్ - బీజేపీ
    శంతను ఠాకూర్ - బీజేపీ
    బండి సంజయ్ - బీజేపీ
    బీఎల్ వర్మ - బీజేపీ
    శోభా కరంద్లాజే - బీజేపీ
    రవనీత్ సింగ్ బిట్టు - బీజేపీ
    సర్బానంద సోనోవాల్ - బీజేపీ
    మనోహర్ లాల్ ఖట్టర్ - బీజేపీ
    హర్ష్ మల్హోత్రా - బీజేపీ
    నిత్యానంద రాయ్ - బీజేపీ
    అజయ్ తమ్తా - బీజేపీ
    సావిత్రి ఠాకూర్ - బీజేపీ
    ధర్మేంద్ర ప్రధాన్ - బీజేపీ
    నిర్మలా సీతారామన్ - బీజేపీ
    రామ్ మోహన్ నాయుడు కింజరపు - తెలుగుదేశం పార్టీ
    చంద్రశేఖర్ పెమ్మసాని - తెలుగుదేశం పార్టీ
    రాందాస్ అథవాలే - రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (A)
    అనుప్రియా పటేల్ - అప్నా దళ్
    జయంత్ చౌదరి - రాష్ట్రీయ లోక్ దళ్
    జితన్ రామ్ మాంఝీ - హిందుస్తానీ అవామ్ మోర్చా
    రామ్ నాథ్ ఠాకూర్ - జనతాదళ్ (యునైటెడ్)
    చిరాగ్ పాశ్వాన్ - లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)
    హెచ్‌డి కుమారస్వామి - జనతాదళ్ (సెక్యులర్)
    ప్రతాపరావు జాదవ్ - శివసేన

  • 09 Jun 2024 03:03 PM (IST)

    ఎన్డీయే ఎంపీలకు జేపీ నడ్డా డిన్నర్..

    ప్రమాణ స్వీకారం కార్యక్రమం తర్వాత కొత్తగా ఎన్నికైన ఎన్డీయే ఎంపీలకు డిన్నర్ ఇవ్వనున్న బీజేపీ చీఫ్ జేపీ నడ్డా..

  • 04 Jun 2024 09:54 PM (IST)

    అరకు పార్లమెంట్ స్థానం ఫలితంపై సందిగ్ధత

    అరకు లోక్‌సభ స్థానం ఫలితంపై సందిగ్ధత కొనసాగుతుంది. 7509 ఓట్లు గల్లంతైనట్లు ఆర్వోకు ఫిర్యాదు చేసిన బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత.. ఓట్ల లెక్కింపుపై స్పష్టత ఇవ్వాలని ఆర్వోను కోరిన కొత్తపల్లి గీత.. అరకు నియోజకవర్గంలో 11, 45, 426 ఓట్లు పోలైనట్లు ప్రకటించిన ఎన్నికల కమిషన్.. కౌంటింగ్‌లో మాత్రం 11, 37, 917 ఓట్లే లెక్కించారని అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత

  • 04 Jun 2024 09:49 PM (IST)

    ప్రత్యేకపై హోదా డిమాండ్ చేసే ధైర్యం మీకుందా..?

    ఏపీలో బీజేపీ, జనసేన పార్టీతో జత కట్టిన టీడీపీ అధినేత చంద్రబాబుకు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఓ సవాల్ చేశారు. కేంద్రంలోని ఎన్డీయేకు మద్దతివ్వాలంటే ముందస్తు షరతుగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసే ధైర్యం మీకు ఉందా అంటూ ప్రశ్నించారు.. ఎన్డీయే అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు కీ రోల్ పోషిస్తారనే వార్తలొస్తుండటంతో ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది.

  • 04 Jun 2024 09:46 PM (IST)

    నితిన్ గడ్కరీ హ్యాట్రిక్ విజయం..

    కేంద్రమంత్రి, నాగ్ పూర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి నితిన్ గడ్కర్ ఘన విజయం సాధించారు. 1. 37 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ స్థానంలో ఆయనకు ఇది వరుసగా మూడో విజయం. మరోవైపు రాజస్థాన్ లోని జోధ్ పూర్ నుంచి గజేంద్ర షెకావత్ గెలిచారు.. అటు రాజ్ కోట్ లో బీజేపీ అభ్యర్థి పర్షోత్తమ్ ఖోడాభాయ్ 4. 84 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

  • 04 Jun 2024 09:39 PM (IST)

    రేపు కేంద్ర కేబినెట్ భేటీ..

    ఢిల్లీలో రేపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ సమావేశం.. ఉదయం 11: 30 గంటలకు భేటీ..

  • 04 Jun 2024 09:00 PM (IST)

    ఎన్డీయేకు ప్రజలు పట్టం కట్టారు: ప్రధాని మోడీ

    ప్రజాస్వామ్యం గెలిచింది.. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే మంత్రం గెలిచింది.. దేశంలో ఎన్నికల నిర్వహణ ప్రతి ఒక్కరూ గర్వించేలా ఉంది.. ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు.. 1962 తర్వాత మూడోసారి ఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రాలేదు.. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ప్రతి రాష్ట్రంలో ఎన్డీయేకు ప్రజలు పట్టం కట్టారు.. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం.. కేరళలో కూడా ఒక సీటు గెలుచుకున్నాం- ప్రధాని మోడీ..

  • 04 Jun 2024 08:40 PM (IST)

    మూడోసారి అధికారంలోకి రాబోతున్నాం..

    మోడీ నేతృత్వంలో మూడోసారి అధికారంలోకి రాబోతున్నాం.. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది.. స్వార్థపూరిత కూటముల ప్రయత్నాలు ఫలించలేదు- జేపీ నడ్డా..

  • 04 Jun 2024 07:32 PM (IST)

    ఓటమి పాలైన దిగ్విజయ్ సింగ్..

    మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ఓడిపోయారు.. రాజ్ గడ్ నుంచి పోటీ చేసి దిగ్గిరాజా తన సమీప బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.

  • 04 Jun 2024 07:17 PM (IST)

    ఓడిపోయిన తమిళనాడు బీజేపీ చీఫ్

    తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై 72 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అన్నామలైపై డీఎంకే గెలుపు..

  • 04 Jun 2024 07:12 PM (IST)

    బీజేపీని గట్టెక్కించిన సౌత్ స్టేట్స్..

    బీజేపీని గట్టెక్కించిన దక్షిణాది రాష్ట్రాలు.. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణల్లో కమల వికాసం.. కాగా, ఇప్పటి వరకు బీజేపీకి కంచుకోటగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో ఈసారి ఆ పార్టీకి గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి..

  • 04 Jun 2024 06:59 PM (IST)

    మోడీ రాజీనామా చేయాల్సిందే: మమతా బెనర్జీ

    లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఎన్డీయే కూటమికి విప‌క్ష ఇండియా కూట‌మి దీటైన పోటీ ఇవ్వడంతో త‌దుప‌రి ప్రభుత్వ ఏర్పాటు విషయంలో తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ రాజీనామా చేయాలంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్.. నిరంకుశత్వాన్ని ప్రజలు ఓడించారని ఈ ఎన్నికల లెక్కలు చెబుతున్నాయి.. ఇది బీజేపీ అహంకారానికి పరాజయం- సీఎం మమతా బెనర్జీ

  • 04 Jun 2024 06:53 PM (IST)

    రేపు ఇండియా కూటమి సమావేశం

    I.N.D.I.A కూటమి సహచరులందరితో రేపు సమావేశం నిర్వహించబోతున్నామని రాహుల్ గాంధీ తెలిపారు. మా సంకీర్ణ భాగస్వామ్య పక్షాలను గౌరవిస్తున్నాం.. వారిని అడగకుండా ఎలాంటి ప్రకటన ఇవ్వబోం- రాహుల్ గాంధీ

  • 04 Jun 2024 06:42 PM (IST)

    రేపు ఢిల్లీకి చంద్రబాబు

    టీడీపీ అధినేత చంద్రబాబు రేపు ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది.. ఎన్డీయే భేటీలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.

  • 04 Jun 2024 06:39 PM (IST)

    హైదరాబాద్‌ ఐదోసారి ఎంఐఎందే

    హైదరాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఘన విజయం సాధించారు.. దాదాపు 3.38 లక్షల ఓట్ల మెజార్టీతో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై గెలుపొందారు.

  • 04 Jun 2024 06:25 PM (IST)

    లోక్‌సభ ఫలితాల ఎఫెక్ట్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్స్

    లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలతో స్టాక్ మార్కెట్‌లు కుదేలైంది.. సెన్సెక్స్ చరిత్రలోనే భారీగా నష్టపోయింది. 5 వేలకు పైగా పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ కూడా అదే బాటలో పయనించింది.

  • 04 Jun 2024 06:23 PM (IST)

    భారీ మెజార్టీతో మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ గెలుపు

    మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ భారీ మెజార్టీతో గెలిచారు. ఆయన పోటీ చేసిన విదిశ నియోజకవర్గం నుంచి 8 లక్షల 25 వేల ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్ధిని ఆయన ఓడించారు.

  • 04 Jun 2024 06:02 PM (IST)

    ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే యుద్ధ చేశాం: రాహుల్ గాంధీ

    ఈ ఎన్నికలు ప్రభుత్వ వ్యవస్థలపై, నిఘా సంస్థలపై చేసిన యుద్ధంగా భావిస్తాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే యుద్ధ చేశాం.. ఎన్నికలకు ముందు మా పార్టీ బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేశారు.. సీఎంలకు జైలుకు పంపారు.. కాంగ్రెస్ కార్యకర్తలు అద్భుతంగా పోరాటం చేశారు- రాహుల్ గాంధీ

  • 04 Jun 2024 05:54 PM (IST)

    ఇది మోడీ వ్యతిరేక తీర్పు..

    ఎన్ని అడ్డంకులు ఎదురైనా కాంగ్రెస్ పోరాటం చేసింది.. నైతికంగా ఇది మోడీకి ఓటమే.. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు.. ఈసారి ప్రజలు ఏ ఒక్క పార్టీకి మెజార్టీ ఇవ్వలేదు.. ప్రజా తీర్పును వినమ్రంగా స్వీకరిస్తున్నా.. రాహుల్ గాంధీ యాత్రలు కాంగ్రెస్ కు ప్లస్ అయ్యాయి- మల్లికార్జున ఖర్గే..

  • 04 Jun 2024 05:50 PM (IST)

    మాజీ క్రికెటర్‌ యూసఫ్‌ పఠాన్ ఘన విజయం

    పశ్చిమ బెంగాల్‌లోని బహరంపుర్‌లో మాజీ క్రికెటర్‌ యూసఫ్‌ పఠాన్‌ గెలిచారు. కాంగ్రెస్‌ సీనియర్ నేత అధీర్‌ రంజన్‌ చౌధరీపై 76 వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు.

  • 04 Jun 2024 05:39 PM (IST)

    అమిత్ షా ఘన విజయం..

    గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ లోక్ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి అమిత్ షా ఘన విజయం సాధించారు. దాదాపు 7 లక్షల ఓట్ల తేడాతో అమిత్ షా విజయం సాధించారు.

  • 04 Jun 2024 05:36 PM (IST)

    ఇందిరా గాంధీ హంతకుడి కుమారుడు విజయం..

    మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హంతకుల్లో ఒకడైన బియాంత్‌ సింగ్‌ కుమారుడు సరబ్‌జీత్‌ సింగ్ ఖల్సా ఈ ఎన్నికల్లో గెలిచారు. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో తన సమీప ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థిపై 70 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

  • 04 Jun 2024 05:33 PM (IST)

    జైలు నుంచి పోటీ.. ఖలీస్తాన్ వేర్పాటువాది అమృత్‌పాల్‌ విజయం

    పంజాబ్‌లోని ఖడూర్‌ సాహిబ్‌లో ‘వారిస్‌ పంజాబ్‌ దే’ అతివాద సంస్థ అధిపతి అమృత్‌పాల్‌ సింగ్‌ గెలిచారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కుల్బీర్‌ సింగ్‌ జీరాపై 1.78 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం.. జాతీయ భద్రతాచట్టం కింద అరెస్టై అస్సాంలోని దిబ్రూగఢ్‌ జైలులో ఉన్న ఆయన ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ

  • 04 Jun 2024 05:19 PM (IST)

    వారణాసిలో ప్రధాని మోడీ హ్యాట్రిక్‌ విజయం..

    ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి ప్రధాని మోడీ వరుసగా మూడోసారి విజయం సాధించారు.. తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌ రాయ్‌పై 1, 52, 513 ఓట్ల తేడాతో గెలుపొందారు.

  • 04 Jun 2024 05:04 PM (IST)

    రేపు ఢిల్లీలో ఎన్డీయే సమావేశం..

    ఎన్డీయే కూటమి రేపు ఢిల్లీలో సమావేశం అవుతుంది. మూడోసారి ప్రభుత్వ ఏర్పాటు చేయడంపై సభ్యులు చర్చించనున్నారు. ఈ విషయాన్ని లోక్ జనశక్తి అధినేత చిరాగ్ పాశ్వాన్ స్పష్టం చేశారు. బీహార్ లో పోటీ చేసిన ఐదు సీట్లలో గెలిచాం.. మా ప్రదర్శనను చూసి అమిత్ షా అభినందించారు. రేపటి ఎన్డీయే సమావేశం గురించి చెప్పారు.. మేం దీనికి హాజరవుతాం..

  • 04 Jun 2024 04:59 PM (IST)

    అయోధ్యలో బీజేపీ ఓటమి..

    ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ తగ్గింది.. 80 ఎంపీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో కమలం వరుసగా రెండోసారి అధికారంలో ఉన్నా.. ఇప్పుడు 45 స్థానాలకు పరిమితమైంది. దేశవ్యాప్తంగా పార్టీకి ప్రధాన ప్రచారాస్త్రంగా మారిన అయోధ్య రామ మందిరం గల ఫైజాబాద్ ఎంపీ స్థానంలోనూ పరాభవం ఎదురైంది. అక్కడ కమలం గుర్తుతో బరలోకి దిగిన లల్లూ సింగ్ ఎస్పీ అభ్యర్థి అవదీశ్ ప్రసాద్ చేతిలో ఓడిపోయారు. సమాజ్ వాదీ నేత 45 వేల ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు.

  • 04 Jun 2024 04:53 PM (IST)

    ఈ ఎన్నికల ఫలితాలు తీవ్రంగా నిరుత్సాహపరిచాయి: కేటీఆర్‌

    నేటి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తీవ్రంగా నిరుత్సాహపరిచాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. అయినా నిరాంతరంగా శ్రమించి బూడిదలో నుంచి కూడా బయటకు వచ్చే ఫీనిక్స్ పక్షి తరహాలో పూర్వ వైభవం సంపాదిస్తాం.. టీఆర్ఎస్ ఏర్పాటైన 24 ఏళ్ల నుంచి అన్నింటినీ చూశాం.. అద్భుతమైన విజయాలు సాధించాం, ఓటములనూ చవిచూశాం.. తెలంగాణ రాష్ట్ర సాధన మా పార్టీకి గొప్ప విజయం.. ప్రాంతీయ పార్టీగా ఉండి రెండు సార్లు రాష్ట్రంలో మంచి మెజార్టీతో గెలుపొందాం.. 2023లోనూ 39 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం- కేటీఆర్

  • 04 Jun 2024 04:52 PM (IST)

    గెలిచిన నంద్యాల వరదరాజుల రెడ్డి

    ప్రొద్దుటూరు : టీడీపీ అభ్యర్థి ఘనవిజయం. 23,191 ఓట్ల మెజార్టీతో గెలిచిన నంద్యాల వరదరాజుల రెడ్డి.

  • 04 Jun 2024 04:49 PM (IST)

    కమ్యూనిస్టుల కోటలో బీజేపీ విజయం..

    కేరళలో బీజేపీ తొలిసారి ఎంపీ స్థానాన్ని దక్కించుకుంది. త్రిసూర్ లో ఆ పార్టీ అభ్యర్థి, నటుడు సురేశ్ గోపీ గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి సునీల్ కుమార్ ( సీపీఐ-ఎం)పై 65 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు..

  • 04 Jun 2024 04:35 PM (IST)

    దేశంలోనే మెజార్టీలో ఆల్ టైమ్ రికార్డ్..

    లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి శంకర్ లల్వాణీ రికార్డ్ సృష్టించారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ పార్లమెంట్ స్థానంలో 11, 75, 092 ఓట్ల తేడాతో విజయం సాధించారు. దేశ చరిత్రలోనే ఈ స్థాయిలో మెజార్టీ సాధించిన వ్యక్తిగా రికార్డులకెక్కారు. ఆయన తర్వాత అత్యధికంగా నోటాకు 2, 18, 674 ఓట్లు వచ్చాయి. మరోవైపు ఇక్కడ బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి తన నామినేషన్ ను విత్ డ్రా చేసుకున్నాడు.

  • 04 Jun 2024 04:30 PM (IST)

    మెదక్ లో బీజేపీ విజయం..

    మెదక్ ఖిల్లాపై ఎగిరిన కాషాయ జెండా.. మెదక్ ఎంపీగా గెలిచిన రఘునందన్ రావు.. చివరి సారిగా 1999లో మెదక్ ఎంపీ సీటు గెలిచిన బీజేపీ.. 25 ఏళ్ల తరువాత మెదక్ సీటును గెలుచుకున్న బీజేపీ

  • 04 Jun 2024 04:22 PM (IST)

    అభ్యర్థి రఘునందన్‌రావు విజయం

    మెదక్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు విజయం.

  • 04 Jun 2024 04:18 PM (IST)

    తెలంగాణలోనే అత్యధిక మెజార్టీ సాధించిన రఘువీర్ రెడ్డి..

    తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి 5 లక్షల 65 వేల భారీ మెజార్టీతో విజయం సాధించారు..

  • 04 Jun 2024 04:13 PM (IST)

    డీకే అరుణ గెలుపు

    మహబూబ్‌నగర్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ గెలుపు. 4,500 ఓట్ల మెజార్టీతో డీకే అరుణ విజయం.

  • 04 Jun 2024 04:03 PM (IST)

    స్మృతి ఇరానీ ఓటమి

    అమేథీలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ ఓటమి. లక్ష ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్‌ అభ్యర్థి కిశోరీలాల్‌ శర్మ విజయం.

  • 04 Jun 2024 03:54 PM (IST)

    ఉత్కంఠ రేపుతున్న మహబూబ్‌నగర్‌ ఎంపీ ఫలితం

    ఉత్కంఠ రేపుతున్న మహబూబ్‌నగర్‌ ఎంపీ ఫలితం. అన్ని రౌండ్లు ముగిసేసరికి 1800 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ. పోస్టల్‌ బ్యాలెట్‌తో తేలనున్న మహబూబ్‌నగర్‌ ఫలితం.

  • 04 Jun 2024 03:51 PM (IST)

    ఎన్డీయే కూటమికి గట్టిపోటీ

    296 స్థానాల్లో ఆధిక్యంలో ఎన్డీయే. 230 సీట్లలో ఆధిక్యంలో ఇండియా కూటమి. ఎన్డీయే కూటమికి గట్టిపోటీ ఇస్తున్న ఇండియా కూటమి.

  • 04 Jun 2024 03:45 PM (IST)

    విజయం దిశగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి..

    కర్ణాటక మాజీ సీఎం, హవేరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బసవరాజు బొమ్మై 41, 600 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కేంద్రమంత్రులు ప్లహ్లాద్ జోషి 94, 822 (ధార్వాడ్), శోభా కరంద్లాజే (బెంగళూరు నార్త్) 2. 25లక్షల ఓట్ల లీడింగ్ లో కొనసాగుతున్నారు. యడియూరప్ప కుమారుడు రాఘవేంద్ర (శివమొగ్గ) 2.37 లక్షలు, తేజస్వీ సూర్య ( బెంగళూరు సౌత్ ) 2. 46 లక్షల ఓట్లతో ముందంజలో ఉన్నారు..

  • 04 Jun 2024 03:38 PM (IST)

    శ్రీభరత్‌ విజయం

    విశాఖ ఎంపీ : టీడీపీ అభ్యర్థి శ్రీభరత్‌ విజయం. 2.84 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచిన శ్రీభరత్‌.

  • 04 Jun 2024 03:38 PM (IST)

    ఆదిలాబాద్ లో బీజేపీ విజయం..

    ఆదిలాబాద్ లోక్ సభ స్థానంలో బీజేపీ ఘన విజయం.. 80 వేల ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ గెలుపు..

  • 04 Jun 2024 03:35 PM (IST)

    మండిలో కంగనా రనౌత్‌ జయకేతనం

    బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ రాజకీయ అరంగేట్రంలోనే విజయం సాధించారు.. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి స్థానంలో బీజేపీ తరఫున పోటీ చేసిన కంగన.. తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై 71 వేల ఓట్ల మెజార్టీతో గెలిచింది.

  • 04 Jun 2024 03:34 PM (IST)

    హాసనలో ప్రజ్వల్ రేవణ్ణ ఓటమి..

    కర్ణాటకలోని హాసన లోక్ సభ నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి, సిట్టింగ్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రేయస్‌ పాటిల్‌ చేతిలో 43 వేల ఓట్ల తేడాతో పరాజయం అయ్యారు.

  • 04 Jun 2024 03:32 PM (IST)

    ఓటమిని అంగీకరించిన రాయ్‌బరేలీ బీజేపీ అభ్యర్థి

    కౌంటింగ్‌ కొనసాగుతుండగానే ఓటమిని అంగీకరించిన రాయ్‌బరేలీ బీజేపీ అభ్యర్థి దినేశ్‌ ప్రతాప్ సింగ్‌

  • 04 Jun 2024 03:27 PM (IST)

    దూసుకుపోతున్న కొండా

    చేవెళ్ల పార్లమెంట్ లో లక్ష యాభై వేల మెజార్టీ దాటిన బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి..

  • 04 Jun 2024 03:25 PM (IST)

    తీవ్ర ఉత్కంఠ

    ఉత్కంఠ రేపుతున్న మహబూబ్ నగర్ లోక్ సభ ఎన్నికల ఫలితం.. రౌండ్ రౌండ్ కు మారుతున్న లెక్కలు.. తాజా రౌండ్ లో 6, 262 ఓటల్ ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ..

  • 04 Jun 2024 02:12 PM (IST)

    హైదరాబాద్‌లో ఫలించని బీజేపీ ఎత్తుగడ

    తెలంగాణలోని హైదరాబాద్ సీటులో ఏఐఎంఐఎం ఆధిపత్యం కొనసాగుతోంది. అక్కడ బీజేపీ అభ్యర్థి మాధవి లతపై పార్టీ అధినేత, సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ 2.33 లక్షల ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు.

  • 04 Jun 2024 02:11 PM (IST)

    ఢిల్లీలోని అన్ని స్థానాలు బీజేపీ కైవసం!

    ఢిల్లీలో బీజేపీ తన సత్తాను చాటుతోంది. పార్టీకి చెందిన ఏడుగురు అభ్యర్థులు తమ సమీప అభ్యర్థుల కంటే ముందంజలో ఉన్నారు. ఈశాన్య ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్ లక్షా 9 వేల ఓట్ల ఆధిక్యంతో వెనుకంజలో ఉన్నారు. అదే సమయంలో, నార్త్-వెస్ట్ ఢిల్లీ నుండి కాంగ్రెస్ అభ్యర్థి ఉదిత్ రాజ్, బీజేపీ అభ్యర్థి యోగేంద్ర చందోలియా కంటే 1.23 లక్షల ఓట్లతో వెనుకబడి ఉన్నారు.

  • 04 Jun 2024 02:09 PM (IST)

    అమేథీలో స్మృతి ఇరానీ ఓటమి దాదాపు ఖాయం

    ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ స్థానం నుంచి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఓటమి ఖాయమైంది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కిషోరీ లాల్ 75 ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇదే స్థానంలో కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై స్మృతి విజయం సాధించారు.

  • 04 Jun 2024 02:08 PM (IST)

    మహారాష్ట్రలో బీజేపీ ఆధిక్యం

    మహారాష్ట్రలో బీజేపీ 12 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరిస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్)లకు చెరో 10 సీట్లు వచ్చాయి. శివసేన (షిండే)కి ఆరు సీట్లు రాగా, శరద్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీకి 8 సీట్లు వచ్చాయి. అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్‌సీపీ ఒక్క స్థానంలో మాత్రమే ఆధిక్యంలో ఉంది.

  • 04 Jun 2024 02:07 PM (IST)

    లక్షకు పైగా ఓట్ల ఆధిక్యంలో ప్రధాని మోడీ

    ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి లోక్‌సభ స్థానంలో 100239 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆయనపై కాంగ్రెస్ నుంచి అజయ్ రాయ్ పోటీలో ఉన్నారు.

Exit mobile version