దేశ వ్యాప్తంగా రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 88 స్థానాల్లో ఓటింగ్ జరిగింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగానే ఉన్నా.. ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. మధ్యాహ్నం సమయంలో కొంచెం మందకొడిగా సాగినా.. సాయంత్రానికి పోలింగ్ పుంజుకుంది. ఓటింగ్ ముగిసే సమయానికి దాదాపు 61 శాతం పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తోంది.
శుక్రవారం స్వల్ప ఉద్రిక్తతలు మినహా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయింది. రెండో విడత ఎన్నికల్లో భాగంగా దేశంలోని 13 రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ స్థానాల్లో ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఛత్తీస్‌గఢ్‌లోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో 3 గంటలకే పోలింగ్ ముగించారు. సమయం ముగిసినప్పటికీ పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో వేచి ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. సాయంత్రం 5 గంటల వరకు 61 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. ఇక కేరళ, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలలో లోపాలు, బోగస్ ఓట్లతో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర, రాజస్థాన్‌లో బన్స్‌వారా, మహారాష్ట్ర, త్రిపురలోని పర్భానిలలో పలు గ్రామాల్లో వివిధ కారణాలతో ఓటర్లు పోలింగ్‌ను బహిష్కరించి నిరసన తెలిపారు.
ఓటు వేసేందుకు పలువురు ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. క్యూ లైన్లో నిలబడి ఓటర్లు వేశారు. ఇక కొత్తగా పెళ్లైన జంటలు కూడా పూలదండలతో వచ్చి మరీ ఓట్లేశారు. రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికీ రెండు దశల్లో పోలింగ్ ముగిసింది. తదుపరి పోలింగ్ మే 7న జరగనుంది. అనంతరం మే 13, 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదలకానున్నాయి.
పోలింగ్ శాతం ఇలా…
అస్సాం-70.66%
బీహార్-53.03%
ఛత్తీస్‌గఢ్-72.13%
జమ్మూకాశ్మీర్- 67.22%
కర్ణాటక- 63.90%
కేరళ-63.97%
మధ్యప్రదేశ్-54.83%
మహారాష్ట్ర- 53.51%
మణిపూర్-76.06%
రాజస్థాన్-59.19%
త్రిపుర-77.53%
ఉత్తరప్రదేశ్- 52.74%
పశ్చిమబెంగాల్-71.84%
Voter turnout till 5 pm for phase 2 of #LokasabhaElection2024
Assam 70.66%
Bihar 53.03%
Chhattisgarh 72.13%
Jammu And Kashmir 67.22%
Karnataka 63.90%
Kerala 63.97%
Madhya Pradesh 54.83%
Maharashtra 53.51%
Manipur 76.06%
Rajasthan 59.19%
Tripura 77.53%… pic.twitter.com/XUBiu9MJ6N— ANI (@ANI) April 26, 2024