Lok Sabha Elections 2024: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. నల్గొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాల్లో ఎన్నికలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
నల్గొండ లోక్‌సభ పరిధిలో ఇలా..
నల్గొండ లోక్‌సభలో పురుషుల కంటే మహిళ ఓట్లే అధికంగా ఉన్నాయి. మహిళా ఓటర్లు 8,80,453 మంది ఉందా.. పురుష ఓటర్లు 8,44,843 మంది ఉన్నారు. నల్గొండ పార్లమెంటు పరిధిలో మొత్తం 17,25,465 మంది ఓటర్లు ఉన్నారు. నల్గొండ పార్లమెంట్ బరిలో 22 మంది అభ్యర్థులు ఉన్నారు. ఎన్నికల అధికారులు నేడు పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలు పంపిణీ చేయనున్నారు. నల్గొండ పార్లమెంట్‌లో మొత్తం 2061 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. ఎన్నికల నిర్వహణ కోసం 2061 బృందాలను ఏర్పాటు చేశారు. 5150 బ్యాలెట్ యూనిట్లు, 2575 కంట్రోల్ యూనిట్లు, 2883 వీవీ ప్యాట్‌లు పంపిణీ చేయనున్నారు. జిల్లా కంట్రోల్ రూమ్‌ల నుండి సిబ్బంది తరలింపుకు 1925 వాహనాలు సిద్ధం చేశారు. 2435 బృందాలు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నాయి.. మరో 374 టీంలు రిజర్వు ఫోర్స్ అందుబాటులో ఉంటాయి.నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఏడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లను ఏర్పాటు చేశారు. ఈవీఎం వాహనాలకు జీపీఆర్ఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేశారు. నల్లగొండ ఎన్నికల నిర్వహణలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. 2600 మంది సివిల్ పోలీసులు, 250 మంది శిక్షణ కానిస్టేబుల్స్, ఏడు కంపెనీల కేంద్రబలగాలు(600 మంది) విధులు నిర్వహించునున్నారు.
భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఇలా..
భువనగిరి లోక్‌సభ నియోజక వర్గ పరిధిలో మొత్తం 18,08,585 ఓట్లు ఉండగా.. అందులో మహిళలు 8,98,416 పురుషులు 9,10,090, ఇతరులు 79 మంది ఉన్నారు. పోటీలో 39 మంది అభ్యర్థులు ఉన్నారు. పోలింగ్ కేంద్రాలు 2141, పోలింగ్ జరిగే ప్రాంతాలు 1325, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 852 ఉన్నాయి. బ్యాలెట్ యూనిట్లు 8023, కంట్రోల్ యూనిట్స్ 2673, వీవీ ప్యాట్స్ 2994లను పంపిణీ చేయనున్నారు. పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బంది, అధికారులు మొత్తం 10,140 మంది విధులు నిర్వహించనున్నారు.