Site icon NTV Telugu

School Holidays: రేపు స్కూళ్లకు, కాలేజీలకు సెలవు.. ఆ జిల్లాలో మాత్రమే..!

Telangana Schools Holidyes

Telangana Schools Holidyes

School Holidays: ఆదిలాబాద్ గిరిజనులు నాగోబా జాతరను ఘనంగా జరుపుకుంటారు. జాతర సందర్భంగా ఈ నెల 12న ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ రోజు పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు స్థానిక సెలవు ప్రకటించారు. ఈ మేరకు కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 12వ తేదీ సెలవు కాకుండా మార్చి 9వ తేదీ రెండో శనివారం విద్యాసంస్థలు యథావిధిగా పనిచేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఉన్న ఇంటర్మీడియట్ కాలేజీలకు ఈ సెలవు వర్తించదని కలెక్టర్ స్పష్టం చేశారు.

Read also: Suryapet: సూర్యాపేటలో ఉద్రిక్తత.. గురుకుల కళాశాలలో మరో విద్యార్థిని ఆత్మహత్య..

ఇక తెలంగాణలో ఈ నెల 15న కూడా సెలవు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రోజును ప్రభుత్వం ఐచ్ఛిక సెలవుగా ప్రకటించింది. ఈ నెల 15న బంజారా ఆరాధకుడైన సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి. అందుకే ఆ రోజు సెలవు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాకు వెల్లడించారు. వచ్చే ఏడాది రాజధాని హైదరాబాద్‌లో సంత్ సేవాలాల్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ముఖ్యంగా గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Haldwani violence : హల్ద్వానీ హింసకు సూత్రధారి కోసం ఢిల్లీ-యుపిలో పోలీసుల సెర్చింగ్

Exit mobile version