Local Boy Nani: విశాఖ ఫిషింగ్ హర్బర్‌లో ప్రమాదంపై విశాఖ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు విచారణ కొనసాగుతోంది.. ప్రధాన నిందితుడిగా భావిస్తోన్న యూట్యూబర్ నాని పాత్పై పోలీసులు ఆరా తీస్తున్నారు.. వన్ టౌన్ పోలీసుల అదుపులో యుట్యూబర్ నాని, మరో పదిమంది యువకులు ఉన్నారు.. మరోవైపు.. వన్ టౌన్ పీఎస్‌కు నాని స్నేహితులు చేరుకుంటున్నారు.. ఆ రోజు ఏం జరిగిందో వివరించారు..
Read Also: Ram Charan: ఆదికేశవ ట్రైలర్ కి చరణ్ సూపర్ రెస్పాన్స్…
ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదంపై నాని స్నేహితులు మాట్లాడుతూ.. ఆ రోజు నాని సవేరా లాడ్జిలో పార్టీ చేసుకున్నాడు.. బోటు తగలపడుతుందని ఫోన్ వస్తే వెళ్లి వీడీయో తీశాడని తెలిపారు. అయితే, వీడియో తీయడంపై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారని.. దీనితో గొడవ పెద్దది అయ్యింది.. ఇదంతా ఫైర్ అంటుకున్న తరువాత జరిగింది మాత్రమే అంటున్నారు. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది.. కానీ, ఫైర్ అంటుకోక ముందే గొడవ జరిగినట్లు ప్రచారం జరుగుతుంది.. ఇది వాస్తవం కాదు అంటున్నారు. ఇలాంటి ప్రచారం వల్ల నాని ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాని ఏ తప్పు చేయలేదు.. అసలు అగ్నిప్రమాదంతో నానికి సంబంధం లేదని చెబుతున్నారు.. కేవలం వీడియో తీయ్యడం వల్ల గొడవ జరిగింది.. అంతే కానీ, అగ్నిప్రమాదం, బోట్లు తగబడిపోయిన ఘటనతో నానికి ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు లోకల్ బాయ్ నాని స్నేహితులు.