Loards Test: లండన్ వేదికగా జరుగుతున్న భారత్, ఇంగ్లాండ్ మూడో టెస్టు చివరి రోజు ఉదయం సెషన్ ముగిసే సమయానికి మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. 193 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన టీమిండియా ఇంగ్లాండ్ బౌలర్లకు సంధానం ఇవ్వలేకపోయింది. చివరిరోజు లంచ్ సమయానికి 8 వికెట్లు కోల్పోయి 112 పరుగులతో నిలిచింది. దీనితో భారత్ విజయానికి మరో 81 పరుగులు అవసరమవగా.. చేతిలో కేవలం 2 వికెట్లు మాత్రమే ఉన్నాయి. అంటే ఇంగ్లాండ్ 2 వికెట్లు పడగొడితే విజయం సొంతం చేసుకుంటుంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లాండ్, భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకి ఆలౌట్ అయ్యాయి. దీనితో ఎవరికీ లీడ్ లభించలేదు. ఇక ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ల ధాటికి 192 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ విజయానికి 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగగా, ప్రస్తుతం 39.3 ఓవర్లలో 112/8తో ఉంది. మొదటి ఓవర్ నుంచే వికెట్ల కోల్పోతూ ముందుకెళ్లిన భారత్ కు ఏ దశలోనూ కలిసి రాలేదు. ఇక ఈ ఇన్నింగ్స్ లో KL రాహుల్ (39), నితీష్ కుమార్ రెడ్డి (13), జడేజా (17)* పరుగులు చేసారు . మిగతావారు డబుల్ ఫిగర్స్ కూడా అందుకోలేకపోయారు. ఇక ఇంగ్లాండ్ తరఫున జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు, స్టోక్స్, కార్సే చెరో 2, వోక్స్ 1 వికెట్ తీశారు. చూడలి మరి బుమ్రా, సిరాజ్ లతో కలిసి జడేజా అద్భుతం సృష్టిస్తాడో.. లేక ఇంగ్లాండ్ కి గెలుపును కట్టబెడుతారో.
Read Also:Make In India : వింబుల్డన్ స్టార్లకు ఇష్టమైనవి ‘మేక్ ఇన్ ఇండియా’ టవళ్లే..! విదేశాల్లో భారత్ హవా..!
Lunch on Day 5 of the Lord's Test! #TeamIndia 112/8 going into the Lunch break!
Updates ▶️ https://t.co/X4xIDiSmBg #ENGvIND pic.twitter.com/exXlB9GWSU
— BCCI (@BCCI) July 14, 2025
