కొండాపూర్ గాయత్రి కేసులో కీలకాంశాలు బయటకు వస్తున్నాయి. పోలీసులు నిందితురాలికి సపోర్ట్ చేస్తున్నారని బాధితురాలి బంధువులు చెబుతున్నారు. అంతా ఆస్తి కోసమే జరిగిందంటున్నారు.గాయత్రి కొండాపూర్‌లోని శ్రీరాంనగర్ కాలనీలో నివాసం ఉంటుంది. తన భాగస్వామి శ్రీకాంత్ తో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న ఓ యువతిపై ఐదుగురు వ్యక్తులతో కలిసి లైంగిక దాడి చేయించింది. ఆ ఘటన మొత్తాన్ని వీడియో తీసింది. పోలీసుల వద్దకు వెళితే తీవ్ర పరిణామాలుంటాయని బాధితురాలిని గాయత్రి బెదిరించింది.బాధితురాలికి తీవ్ర గాయాలు కావడంతో.. ఆమె కుటుంబ సభ్యులు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసుకు సంబంధించి ఆరుగురు నిందితులను గాయత్రి, మనోజ్ కుమార్ (22), సయ్యద్ మస్తాన్ (25), షేక్ ముజాహిద్ (25), షేక్ మౌలా అలీ (32), పృధ్వీ విష్ణు వర్ధన్ (22)లుగా గుర్తించారు.