Site icon NTV Telugu

Live-in Relationship: సహజీవనం చేస్తే ఆస్తిలో వాటా ఇవ్వాల్సిందే.. కానీ అది నిరూపించాలి..!

Live In Relationship

Live In Relationship

ఒక స్త్రీ, ఒక పురుషుడు కలిసి చాలాకాలంగా సహజీవనం చేస్తున్నట్లైతే వారి మధ్య బంధాన్ని వైవాహిక సంబంధంగానే పరిగణించాలంటూ సుప్రీం కోర్టు గతంలో స్పష్టం చేసింది. వారికి పుట్టిన సంతానానికి తమ పూర్వీకుల ఆస్తిలో వాటా పొందే హక్కు కూడా ఉంటుందని తేల్చి చెప్పింది. సాధారణంగా ఒక వ్యక్తికి సంబంధించిన ఆస్తులు వారి తదనంతరం వారసులకు లేదా రక్తసంబంధీకులకు చెందుతాయి. కొంతమంది ఆస్తుల పంపిణీ ఎలా జరగాలి అనేది వీలునామా రాస్తారు. ఇది లీగల్ డాక్యుమెంట్. అయితే వీలునామా లేనప్పుడు, స్పష్టంగా ఆస్తుల పంపిణీ జరగనప్పుడు వారసుల మధ్య వివాదాలు తలెత్తుతాయి. ఎవరికి ఎంత ఆస్తి దక్కుతుందో తెలుసుకోవడానికి కోర్టులను ఆశ్రయిస్తుంటారు.

READ MORE: Chhangur Baba: ఆర్ఎస్ఎస్ ముసుగులో ‘‘ఛంగూర్ బాబా’’ అరాచకాలు, మోడీ పేరు మిస్ యూజ్..

అయితే సహజీవనం చేస్తున్న లివ్ ఇన్ పార్నర్‌ సైతం ఆస్తిలో వాటా డిమాండ్ చేయవచ్చట. కానీ.. కొన్ని నియమాలు పాటించాలట. ఉదాహరణకు ఇటీవల ఇద్దరు పిల్లల తండ్రి చనిపోయారు. 15 ఏళ్ల క్రితమే తల్లి కన్నుమూసింది. తండ్రి ఆస్తులను ఇద్దరు పిల్లల మీద రాశారు. అయితే మరణానికి ముందు తండ్రి ఓ మహిళతో సహజీవనం చేసేవారు. ఆమె ఇప్పుడు ఆస్తుల్లో వాటా కోరుతోంది. ఈ విషయంలో ఆమెకు చట్టపరంగా ఎలాంటి మద్దతు ఉంటుందనేది సుప్రీం కోర్టు గత తీర్పుల్లో చర్చించింది. లివ్-ఇన్ రిలేషన్స్‌లో భాగస్వాములకు పుట్టిన పిల్లలను చట్టబద్ధ వారసులుగా పరిగణించవచ్చని తీర్పు చెప్పింది. కానీ దీనికి సంబంధించి అధికారిక చట్టం లేదు. మేల్‌ పార్ట్‌నర్‌కి చెందిన ఆస్తుల్లో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న ఫీమేల్‌ పార్ట్‌నర్‌కి ఉన్న హక్కులు ఇప్పటికీ అస్పష్టంగా ఉన్నాయి.

READ MORE: AM Ratnam: హరి హర వీరమల్లు కల్పిత పాత్ర.. ప్రెజర్ ను బాధ్యతగా ఫీల్ అవుతున్నా!

తండ్రి వీలునామాను సహజీవనం చేస్తున్న మహిళ సవాలు చేస్తే.. వీలునామా వాస్తవికతను నిరూపించే భారం లేదా ప్రొబేట్ ప్రొసీడింగ్‌లో కాంటెస్ట్‌ చేయడానికి ఫీమేల్‌ పార్ట్‌నర్‌ అర్హత న్యాయస్థానంపై ఆధారపడి ఉంటుంది. ఆమె చేసిన వాటా క్లెయిమ్‌ను వ్యతిరేకించేందుకు వీలునామా లబ్ధిదారులు అవసరమైన ఆధారాలు అందజేయాలి. అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాల ఆధారంగా క్లెయిమ్‌ల చెల్లుబాటును కోర్టు నిర్ణయిస్తుంది. ఆస్తిలో వాటా పొందేందుకు ఉన్న అర్హత కారణాలను సహజీవనం చేసిన మహిళ కోర్టులో నిరూపించుకోవాల్సి ఉంటుంది.

Exit mobile version