NTV Telugu Site icon

Viral Video : ఏందయ్యా ఇది.. పిచ్చి పరాకాష్టకు చేరిందా ఏందీ?..వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Live Fish Dress

Live Fish Dress

ఫ్యాషన్ పేరుతో వింత వింత డ్రెస్సులను వేస్తున్నారు.. అందులో కొన్ని డ్రెస్సులు వావ్ అనిపిస్తే.. మరికొన్ని డ్రెస్సులు ఏందయ్యా ఈ పిచ్చి అంటూ జనాలకు కోపాన్ని తెప్పిస్తున్నాయి.. ఇప్పుడు ఓ యువతి వేసుకున్న కొంత ఆశ్చర్యాన్ని కలిగించిన, మరికొంతమందికి షాక్ ఇస్తుంది.. ఇంతకీ ఆ యువతి వేసుకున్న డ్రెస్సు వెరైటీగా ఉంది.. బ్రతికున్న చేపలతో తయారు చేశారు.. మొత్తం ఒక సాగర కన్యగా ఆ యువతి కనిపిస్తుంది.. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

లైవ్ ఫిష్‌తో కూడిన గౌనులో ఉన్న మహిళ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఆమె యొక్క వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించినప్పటి నుండి, అది వైరల్‌గా మారింది, చాలా మంది నీ ఫ్యాషన్ కోసం ఆ చేపలను చంపడం ఎందుకు అంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.. ఒక అమ్మాయి మెర్మైడ్ డ్రెస్సులో ముందు భాగంలో జతచేయబడిన గిన్నెతో నిలబడి ఉన్నట్లు వీడియో మొదలవుతుంది.. అప్పుడు ఒక వ్యక్తి ఒక బ్యాగ్ నుండి గిన్నెకు బ్రతికున్న చేపలను పోస్తాడు. తరువాత, ఆ అమ్మాయి చేపతో పోజులివ్వడాన్ని చూడవచ్చు..

అయితే,ఈ పోస్ట్ సెప్టెంబర్ 30న షేర్ చేయబడింది. షేర్ చేసినప్పటి నుండి, ఇది ఎనిమిది మిలియన్లకు పైగా వీక్షణలతో వైరల్‌గా మారింది. ఈ వీడియో చాలా సార్లు లైక్ కూడా అయింది. చాలా మంది ఈ అసాధారణ దుస్తులపై తమ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పోస్ట్ చేశారు.. ఒక వ్యక్తి ఇలా కామెంట్ చేశాడు.. మీకు మంచి ఫ్యాషన్ సెన్స్ ఉంది ఓకే.. కానీ మీరు బ్రతికున్న జీవాలను హింసిస్తున్నారని రాశాడు.. మొత్తానికి ఆమె డ్రెస్సును, అందాన్ని పొగిడిన వాళ్లే లేరు కేవలం చేపలకు ఏమౌతుందో అని మాత్రం కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి ఈ వీడియో మరోసారి వైరల్ అవుతుంది.. ఒక్కసారి ఆ వీడియోను మీరు చూసి ఒక కామెంట్ వేసుకోండి..