Site icon NTV Telugu

Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్.. రేపు మద్యం దుకాణాలు బంద్

Liquor Stores

Liquor Stores

Liquor Shops Closed: రేపు(మంగళవారం) వైన్‌ షాపులు, బార్లు తెరుచుకోవు. హనుమాన్ జయంతి సందర్భంగా మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. హనుమాన్ జయంతి నేపథ్యంలో ఈ నెల 23న శోభాయాత్రను వైభవంగా నిర్వహించనున్నారు. కావున హనుమాన్ జయంతి సందర్భంగా రేపు హైదరాబాద్‌లో బార్లు, మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రేపు ఉదయం 6 నుంచి ఎల్లుండి ఆదివారం ఉదయం 6 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. బార్ అండ్ రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు మూసివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్న శోభాయాత్ర గౌలిగూడలోని రాంమందిర్‌ నుంచి సికింద్రాబాద్‌ తాడ్‌బంద్ హనుమాన్ ఆలయం వరకు జరుగుతుందని తెలిపారు. శోభాయాత్ర ఏర్పాట్లు, రూట్‌మ్యాప్‌ను ఆయన పరిశీలించారు. ఈయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Read Also: Kaleshwaram: కాళేశ్వరం అటవీ ప్రాంతంలో కార్చిచ్చు కలకలం

Exit mobile version