Site icon NTV Telugu

Viral Video: మీరు సింహాలయ్యా.. అలా భయపడితే ఎలా?

Lion

Lion

Lions Give Side to Rhinos: సాధారణంగా అడవి రాజు సింహం. ఇది మనందరికి చిన్నప్పటి నుంచి తెలిసిందే. ఏ జంతువులైనా సింహాన్ని చూస్తే గడగడలాడాల్సిందే. పక్కకు పారిపోవాల్సిందే. అయితే ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిని చూస్తుంటే నిజంగా సింహాలేనా ఇలా చేస్తుంది అని ఆశ్చర్యం వేస్తుంది. సింహం అసలు తన దగ్గరకు ఎవరైనా వస్తేనే పంజాతో ఒక్కటిచ్చి పళ్లతో చీల్చి ముక్కలు ముక్కలు చేస్తుంది. అలాంటి ఈ మధ్య కొన్ని వీడియోలో ఓ యువతి ఫుడ్ షేర్ చేసుకోవడం చూశాం. అంతేనా సింహాల మధ్యలో కూర్చొని  వాటినే కొట్టడం చూశాం. అంతేనా మొన్నీమధ్య ఓ చిన్న జీవి తాబేలు సింహం ప్లేట్ లో ఉంచిన మాంసాన్ని దానితో కలిసి కూర్చొని తినడం చూశాం. ఇక ఇప్పుడు కూడా సింహాల స్వభావానికి విరుద్ధమైన రెండు వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Also Read: G20 Summit: భారత్ బయలుదేరిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. ఢిల్లీ వీధుల్లో తిరగనున్న ‘ది బీస్ట్‌’!
మొదటి వీడియోలు రెండు సింహాలు పడుకొని ఉంటాయి. అయితే ఆ దారిలో రెండు ఖడ్గమృగాలు వస్తూ ఉంటాయి. సాధారణంగా సింహాలు వస్తుంటే ఏ జంతువులైనా సైడ్ ఇవ్వాలి. కానీ వాటిని చూసి సింహాలే దారి ఇచ్చి పక్కకు జరిగాయి. దీకిని సంబంధించిన వీడియోను సుశాంత నందా అనే వ్యక్తి తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేస్తూ ఎప్పుడు అడవికి పులులు, సింహాలకే రాజులు కాదు పరిస్థితులు దానిని నిర్ణయిస్తాయి అని క్యాప్షన్ జోడించారు.

ఇక మరో వీడియోలో ఓ పెద్ద ఏనుగు నెమ్మదిగా నడుచుకుంటూ వస్తుంది. అయితే సింహానికి అలా ఒంటరిగా ఏనుగు చిక్కితే అది ఎంత పెద్దది అయినా దానిని ఒక్క దెబ్బతో కింద పడేసి దాని కడుపు నింపుకుంటుంది. అలాంటి ఏనుగును చూసి ఆ సింహం ఒక్కసారిగా పరుగులు పెట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లార్డ్ ఆఫ్ జంగిల్, కింగ్ ఆఫ్ ఫారెస్ట్ గొడవను వద్దనుకున్నాయి. అందుకే వెళ్లడానికి ఒక దానికి మరొకటి దారి ఇచ్చిందని క్యాప్షన్ జోడించి రమేష్ పాండే అనే యూజర్ ఎక్స్( ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు.

 

 

 

Exit mobile version