NTV Telugu Site icon

Messi-Ronaldo : రొనాల్డో వరల్డ్ రికార్డ్.. మరి మెస్సీ ఊరుకుంటాడా?

Messi Ronald

Messi Ronald

ప్రస్తుత ఫుట్ బాల్ తరంలో క్రిస్టియానో రొనాల్డో, లియోనల్ మెస్సీ ఎవరికి వారే సాటి. వ్యక్తిగతంగా ఎన్నో రికార్డులు అందుకున్న ఈ ఇద్దరు సమానంగానే కనిపంచినా మెస్సీ ఒక మెట్టు ఫైనే ఉంటాడు. అందుకు కారణం గతేడాది డిసెంబర్ లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ లో అర్జెంటీనాను విజేతగా నిలపడమే.. అన్నీ తానై జట్టును నడిపంచిన మెస్సీ అత్యధిక గోల్స్ చేసి 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అర్జెంటీనాకు మూడోసారి టైటిల్ అందించాడు. ఈ దెబ్బతో రొనాల్డో కాస్త వెనుకబడినట్లుగా కనిపించాడు.

Also Read : Mekapati Chandrasekhar Reddy: నేను వెంకటరమణకే ఓటేశా.. అవన్నీ తప్పుడు ఆరోపణలే

అయితే వ్యక్తిగతంగా చూస్తే మాత్రం ఇద్దరు పోటాపోటీగా ఉంటారు. ఒక రికార్డ్ రొనాల్డో బద్దలు కొట్టాడంటే వెంటనే మెస్సీ తన పేరిట ఒక రికార్డును లిఖించుకోవడం చూస్తూనే ఉంటాం.. తాజాగా క్రిస్టియాన్ రొనాల్డో దేశం తరపున అత్యధిక మ్యాచ్ లు ఆడిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అయితే నీ వెనుక నేను వస్తా అంటూ మెస్సీ కూడా తన కెరీర్ లో 800వ గోల్ సాధించి కొత్త రికార్డు అందుకున్నాడు. బ్రూనస్ ఎయిర్స్ వేదికగా గురవారం అర్జెంటీనా, పనామాల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది.

Also Read : Naresh Pavitra Lokesh: ఓరీవారి… మళ్లీ పెళ్లి అనేది సినిమానా?

ఈ మ్యాచ్ లో మెస్సీ సేన 2-0 తేడాతో విజయం సాధించింది. ఆట 89వ నిమిషంలో అర్జెంటీనాకు లభించిన ఫ్రీకిక్ ను మెస్సీ తనదైన శైలిలో గోల్ గా మలిచాడు. దీంతో తన కెరీర్ లో 800వ గోల్ పూర్తి చేసుకున్న మెస్సీ అర్జెంటీనా తరపున 99వ గోల్ సాధించాడు. వంద గోల్ చేరుకోవడానికి మెస్సీ ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నాడు. ఇక క్లబ్స్ తరపున 701 గోల్స్ చేసిన మెస్సీ ఓవరాల్ గా 800 గోల్స్ తో కొనసాగుతున్నాడు. గతేడాది డిసెంబర్ లో ఖతర్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్ లో విశ్వవిజేతగా నిలిచిన జట్టుతోనే అర్జెంటీనా బరిలోకి దిగడం విశేషం.