Site icon NTV Telugu

Tirupathi: తిరుపతి జూపార్క్‌లో వ్యక్తిని చంపిన సింహం

Lion

Lion

Tirupathi ZOO Park: తిరుపతి జూపార్క్‌లో విషాదం చోటుచేసుకుంది. లయన్‌ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన వ్యక్తిపై సింహం దాడి చేసి చంపేసింది. తిరుపతిలోని జూపార్క్‌ సందర్శనకు వెళ్లిన వ్యక్తి సెల్ఫీ కోసం లయన్‌ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లినట్లు తెలిసింది. సింహం అరుపులతో ఆ వ్యక్తి చెట్టు ఎక్కాడు. కానీ భయంతో అదుపు తప్పి కిందపడిపోయాడు. ఆ వ్యక్తిని గమనించిన సింహం అతడిపై ఒక్కసారిగా దూకి దాడి చేసింది. ఈ దాడిలో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

Read Also: Priyanka Singh: కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నా.. ఆ సర్జరీ తరువాత అక్కడ నొప్పి తట్టుకోలేక

అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సింహం దాడిలో మృతి చెందిన మృతుడిని రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద్‌ గుర్జర్‌గా గుర్తించారు. సింహాన్ని ఎన్‌క్లోజర్‌ కేజ్‌లో అధికారులు బంధించారు. సమాచారం అందుకున్న తిరుపతి రూరల్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనపై డీఎస్పీ శరత్‌రాజ్‌ జూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే సెల్ఫీ దిగడానికి సింహాల ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన సందర్శకుడు.. భయంతో చెట్టు ఎక్కి కింద పడినట్లు తెలుస్తోంది. సింహం నోటికి చిక్కడంతో బాధితుడి తల భాగాన్ని సింహం పూర్తిగా తినేసినట్లు తెలిసింది.

రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద్ గుర్జార్ వృత్తిరీత్యా డ్రైవర్ పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం హైదరాబాద్ నుండి టిక్కెట్ కొని బస్సులో తిరుపతి వచ్చినట్లు గుర్తించారు పోలీసులు. అయితే ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతోనే నిషేదిత ప్రాంతమైన లయన్ ఎన్ క్లోజర్‌లోకి అతను దూకినట్లు భావిస్తున్నారు జూ పార్క్ అధికారులు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.డెడ్ బాడి పోస్టు మార్టమ్ నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు.

 

Exit mobile version