Lingamneni Ramesh Son: ఎంపీ లింగమనేని కుమారుడు సంజూష్‌పై కేసు.. నేడు పోలీసుల విచారణకు హాజరు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని మాదాపూర్ ఇనార్బిట్ మాల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో జనసేన పార్టీ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజూష్‌పై విచారణ కొనసాగుతోంది. ఆగస్టు 16న జరిగిన ఈ ప్రమాదంలో భారతి అనే యువతి మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంజూష్ కారు నడుపుతూ ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఆగస్టు 16న ఇనార్బిట్ మాల్ సమీపంలో సంజూష్ నడుపుతున్న కారు భారతి అనే మహిళను ఢీకొట్టడంతో.. ఆమె తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంజూష్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షతో పాటు డ్రగ్ టెస్టులు కూడా నిర్వహించారు. టెస్టుల్లో నెగిటివ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, కారు వేగం, డ్రైవింగ్ తీరుతో పాటు ఇతర అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
కేసు దర్యాప్తులో భాగంగా సంజూష్‌ను మరోసారి విచారించేందుకు పోలీసులు నేడు హాజరు కావాలని ఆదేశించినట్లు సమాచారం. విచారణలో ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలను పోలీసులు సేకరించే అవకాశం ఉంది. ప్రమాద సమయంలో వాహనం పరిస్థితి, డ్రైవింగ్‌కు సంబంధించిన అంశాలతో పాటు అందుబాటులో ఉన్న ఇతర ఆధారాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రోడ్డు ప్రమాదంలో గాయపడిన భారతిని వెంటనే ఆస్పత్రికి తరలించినట్టు, దురదృష్టవశాత్తూ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారని సంజూష్ తాజాగా తెలిపారు. ప్రమాదం తర్వాత తాను అక్కడి నుంచి పారిపోలేదని, పోలీసులకు సమాచారం ఇచ్చానని చెప్పారు. దర్యాప్తులో పోలీసులకు పూర్తిగా సహకరించానని సంజూష్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?