NTV Telugu Site icon

Lineman Dead: విద్యుత్ షాక్ తో స్తంభంపైనే ప్రాణాలు వదిలిన లైన్ మెన్..

Lineman Dead

Lineman Dead

సంగారెడ్డి జిల్లాలో ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది. విధుల్లో చేరిన ఏడు నెలల్లోనే ఓ జూనియర్ లైన్ మెన్ ను మృతువు కబళించింది. విద్యుత్ స్తంభం పై ఉంది వైర్లు సవరిస్తుండగా ఆ కరెంట్ షాక్ కు గురై స్తంభం పైనే జూనియర్ లైన్ మెన్ అక్కడిక్కడే మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల పరిధిలోని మల్లికార్జునపల్లి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఐకే ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి పట్టణానికి చెందిన బాల్ రాజు అనే వ్యక్తి గత అక్టోబర్ నెలలో మునిపల్లి మండలం మల్లికార్జునపల్లి జూనియర్ లైన్ మెన్ గా నియామకమయ్యారు. ఇక అప్పట్నుంచి అతను విధులు నిర్వర్తిస్తున్నాడు.

Student Teacher Romantic Video: క్లాస్ లో టీచర్ తో స్టూడెంట్ రోమాంటిక్ స్టెప్పులు..

శుక్రవారం నాడు ఉదయం సమయంలో మల్లికార్జునపల్లి గ్రామంలో విద్యుత్ సరఫరాలో ఓ ప్రాంతంలో అంతరాయం ఏర్పడింది. దీనితో బాల్ రాజు విద్యుత్ తీగలు సరిచేసేందుకు స్థంభంపైకి ఎక్కి., అక్కడ స్తంభం పై విద్యుత్ తీగలు సరిచేస్తుండగా ఆకస్మికంగా విద్యుత్ సరఫరా కావడంతో అనుకోకుండా షాక్ కు గురయ్యాడు. ఈ నేపథ్యంలో విద్యుత్ తీగలలో చిక్కుకొని విద్యుత్ స్థంభం పైనే ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటనతో అతని కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు.

Diamond In Field: పొలంలో రైతుకి లభించిన విలువైన వజ్రం.. భారీ ధరకి..

మృతుడు బాలరాజు కు తల్లితండ్రులతో పాటు ఒక చెల్లి కూడా ఉంది. ఇక తండ్రి సంగారెడ్డి మున్సిపాలిటీలో శానిటేషన్ వర్కర్ గా పని చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యుత్ అధికారులు సంఘటన జరిగిన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

Show comments