Andhra Pradesh: నైరుతి బంగాళాఖాతంపై ఉత్తర తమిళనాడు తీరం ఆనుకుని ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.. దీని ప్రభావంతో.. రాష్ట్రంలో మూడు రోజులు అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.. వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున ఉరుములతో కూడిన వర్షం కురిసేపుడు వ్యవసాయ పనుల్లోని రైతులు, పొలాల్లో పనిచేసే కూలీలు, పుశువులు, గొర్రె కాపరులు చెట్ల క్రింద ఉండరాదని.. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
Read Also: Hyundai Xeter: మార్కెట్లోకి వచ్చిన హ్యుందాయ్ ఎక్స్‌టర్.. ఫీచర్లు అదిరిపోయాయి..!
ఇక, రాబోయే మూడు రోజుల వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయన్న వివరాల్లోకి వెళ్తే.. రేపు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది విపత్తుల నిర్వహణ సంస్థ.
Read Also: Russia-Ukraine War: 500 రోజులుగా కొనసాగుతున్న రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం..!
ఇక, ఎల్లుండి అంటే ఈ నెల 12వ తేదీన పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందంటున్నారు.. మరోవైపు ఈ నెల 13వ తేదీన శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామ రాజు, కాకినాడ, తూర్పుగోదావరి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని లెల్లడించారు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్.