ప్రస్తుతం మనం ఇంటర్నెట్ యుగంలో బతుకుతున్నాం. నెట్ లేకుండా అరక్షణం కూడా ఉండలేకపోతున్నాం. ఇంటర్నెట్ ఛార్జీలు తక్కవ ధరకు అందుబాటులో ఉండటం కూడా మనం నెట్ కు బాగా అలవాటు పడేలా చేస్తోంది. నెట్ వర్కింగ్ కంపెనీలు పోటీలు పడి మరి బెస్ట్ ఆఫర్లకు ఇంటర్నెట్ సేవలను అందిస్తున్నాయి. అయితే ఇంటర్నెట్ సింగల్స్ ను మనం చాలా విధాలుగా పొందవచ్చు. మన మొబైల్ లో ఉన్న సిమ్ కార్డు నెట్ వర్క్ ను ఆన్ చేసి మొబైల్ డేటా ఉపయోగించవచ్చు. లేదంటే మోడం లాంటి వాటిని ఉపయోగించవచ్చు. ఇక ప్రస్తుతం ప్రతి ఇంటిలో వైఫై ను ఉపయోగిస్తున్నారు. దీని గురించి అందరికే తెలిసిందే. వైఫై, బ్రాడ్ బ్యాండ్, రూటర్ వంటి పదాలు చిన్నవారి నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరు ఉపయోగిస్తున్నారు.
బయటకు వెళ్లిన, ఇంట్లో ఉన్న ప్రతి క్షణం మన చేతితో ఫోన్ ఉండాల్సిందే. దానిలో ఇంటర్నెట్ ఉపయోగించాల్సిందే. వీటిపై మనం చెప్పలేనంతగా ఆధారపడిపోయాం. నిజం చెప్పాలంటే కాళ్లు, చేతులు లాగా ఇవి కూడా మన శరీరంలో భాగమయిపోయాయి. ఇవి లేకపోతే నిమిషం కూడా ఉండలేని పరిస్థితికి వచ్చేశాం. ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకుండా క్షణం కూడా గడవని కాలంలో మనం ఉన్నాం. బహిరంగ ప్రదేశాల్లో మొబైల్ కనెక్టివిటీ, ఇళ్లల్లో వైఫైపై మాటల్లో చెప్పలేనంతగా ఆధారపడిపోయారు. అయితే ప్రస్తుతం సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. వైఫైతో వీటి బారిన పడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. సైబర్ నేరగాళ్లు వైఫై ద్వారా డేటాను చాలా ఈజీగా దొంగలించగలుగుతున్నారు. అందుకే మన డేటాను గోప్యంగా ఉంచడానికి లైఫై (LiFi) బెటర్ అని చెప్పవచ్చు.
Also Read: Second Hand Car: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా?.. ఈ విషయాలు తెలుసుకోండి
లైఫై (LiFi) ఏంటి అనుకుంటున్నారా? మనలో చాలా మందికి వైఫై గురించి తెలుసుకానీ, తక్కువ మందికి మాత్రమే లైఫై (LiFi) గురించి తెలుసు. ఈ నూతన సాంకేతికతో వైఫై కంటే అధిగ ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. రేడియో వేవ్స్ తో సమాచారం పంపించడం వైఫై అయితే కాంతితరంగాలతో సమాచారాన్ని ప్రసారం చేయడమే లైఫై. ఇందుకోసం కేవలం ఒక ఎల్‌ఈడీ బల్బ్‌తో పాటూ ప్రస్తుత టెక్నాలజీకి చిన్న చిన్న మార్పులు చేస్తే వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు పొందొచ్చు. దీనికి 800 నుంచి 100 ఎన్ఎమ్ వేవ్‌లెన్త్ గల కాంతి తరంగాలు కావాలి. దీని ద్వారా 10ఎమ్‌బీపీఎస్ నుంచి గరిష్ఠంగా 9.6జీబీపీఎస్ వేగంతో కూడిన ఇంటర్నె్ట్ కనెక్టివటీ పొందవచ్చు. ఎల్ఈడీ బల్బులు, లేసర్ డయోడ్, సిలికాన్ ఫొటో డయోడ్ వంటి వాటితో సులభంగా లైఫైని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక రేడియో తరంగాల మీద ఆధారపడే వైఫైలో ఎన్ని పాస్ వర్డ్ లు పెట్టుకున్నా హ్యాకింగ్ కు గురయ్యే అవకాశం ఉంది కానీ లైఫై ఉపయోగిస్తే హ్యాకింగ్ కు గురయ్యే అవకాశం ఉండదు. దీని వల్ల కలిగే అతి ముఖ్యమైన ప్రయోజనాల్లో ఇది ఒకటని చెప్పుకోవచ్చు.