Site icon NTV Telugu

LIfe Span of Honeybees: తేనె బతుకు.. 50 ఏండ్లలో 50 శాతం తగ్గింది!

Life Span Of Honeybees

Life Span Of Honeybees

LIfe Span of Honeybees: తేనెటీగలు మానవ, పర్యావరణ ఆరోగ్యం రెండింటిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. అలాంటి తేనెటీగల జీవితకాలం సగానికి తగ్గిందంటే నమ్ముతారా?. నిజమేనండి.. ఇన్ని రోజులు మనిషి జీవితకాలం మాత్రమే తగ్గుతుందని అనుకున్నాం.. కానీ జాబితాలోకి తేనెటీగలు కూడా వచ్చాయి. సైన్స్‌అలర్ట్ మ్యాగజైన్ ప్రకారం, గత 50 ఏళ్లలో వయోజన తేనెటీగ జీవితకాలం దాదాపు 50 శాతం ఎలా తగ్గిపోయిందో సూచిస్తుంది. అవునండి.. 50 యేండ్లలో వీటి జీవితకాలం 50శాతానికి తగ్గినట్లు కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. తేనె వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని తెలుసు. అధిక కొవ్వును, రక్తపోటును కూడా నియంత్రించే గుణం ఈ తేనెకు ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ తేనె దొరక్కుండా పోతుందట. ఒకప్పుడు సహజసిద్ధంగా దొరికే తేనె ఇప్పుడు పంజరాల మధ్య చిక్కుకుంది. ఒకప్పుడు తేనెటీగల జీవితకాలం బాగానే ఉన్నా.. ఇప్పుడే పరిస్థితి మొత్తం తలకిందులైంది.

ఇప్పుడు, తేనెటీగల జీవితకాలం 50 శాతం పడిపోయినట్లు కనిపిస్తోంది. 50 సంవత్సరాల క్రితం ఉన్న వాటితో పోలిస్తే 50 శాతం పడిపోయినట్లు శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. మేరీల్యాండ్ విశ్వవిద్యాలయంలోని కీటక శాస్త్రవేత్తలు నియంత్రిత, ప్రయోగశాల వాతావరణంలో ఉంచబడిన వ్యక్తిగత తేనెటీగల జీవితకాలాన్ని అధ్యయనం చేశారు. వారి జీవితకాలం 1970లలో ఉన్న దానికంటే 50శాతం తక్కువగా ఉందని వారు కనుగొన్నారు. ఈ ఆందోళనకరమైన ధోరణి, తేనెటీగల పెంపకందారులు గుర్తించిన తేనె ఉత్పత్తిని తగ్గించడంతో పాటు తేనె కాలనీలలో గుర్తించిన నష్టాలకు అనుగుణంగా ఉంది. యూఎస్‌లో మాత్రమే, తేనెటీగల పెంపకందారులు తేనె కాలనీల్లో అధిక నష్టాల రేటును నివేదించారు. పరాగ సంపర్కాల్లో తేనెటీగలు భూమి వాతావరణంలో అస్థిరమైన మార్పులను కొనసాగించడానికి చాలా కష్టపడుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే మన ఆహార భద్రత విషయంలో, పర్యావరణ వ్యవస్థలపై ఎంతో ప్రభావం చూపక మానదు.

Swimming: బామ్మ అదుర్స్.. 82 ఏళ్ల వయసులోనూ మూడు బంగారు పతకాలు

పర్యావరణ ఒత్తిళ్లు తేనెటీగల జీవితకాలంలో కీలక పాత్ర పోషిస్తుండగా, సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురించబడిన కొత్త అధ్యయనంలో శాస్త్రవేత్తలు మొదటిసారిగా జన్యుశాస్త్రాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. ‘మనం కొన్ని జన్యుపరమైన కారకాలను వేరు చేయగలిగితే, మనం ఎక్కువ కాలం జీవించే తేనెటీగలను పెంచుకోవచ్చు’ అని నియర్‌మాన్ అనే అధ్యయనకర్త చెబుతున్నాడు. నియంత్రిత వాతావరణంలో తేనెటీగల ఆహారాన్ని మార్చడం వాటి జీవితకాలంపై ఎలాంటి ప్రభావం చూపదని కూడా ఆయన అంటున్నాడు. అయితే 1970 కాలంలో 34.3రోజులు తేనెటీగలు బతికి ఉన్నాయి. ఇప్పుడు 17.7 రోజులకు వాటి జీవితకాలం పడిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే మనకు తేనె దొరకడం కష్టంగా మారిపోతుంది.

కెనడా, ఆస్ట్రేలియా, బెల్జియం, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, గ్రీస్, ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫిన్లాండ్ మరియు పోలాండ్‌లు అసాధారణంగా అధిక తేనెటీగ కాలనీ మరణాల రేటును నివేదించాయి. యూకేలో 2012-2013 కఠినమైన శీతాకాలంలో 29 శాతం తేనెటీగ కాలనీలు నశించాయి. దశాబ్దాలుగా తేనెటీగల జీవితకాలం 50 శాతం తగ్గింపు ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే, తేనె కాలనీలకు నష్టం రేట్లు 33 శాతం వరకు పెరుగుతాయి. శాస్త్రవేత్తలు ఇప్పుడు ఈ డేటాను ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన సారూప్య పోకడలతో కలపాలని ఆశిస్తున్నారు.

Exit mobile version