Site icon NTV Telugu

LIC recruitment 2025: ఎల్ఐసీలో జాబ్ నోటిఫికేషన్.. లక్షల్లో జీతాలు

Lic Recruitment

Lic Recruitment

LIC recruitment 2025: జాబ్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO), అసిస్టెంట్ ఇంజనీర్ (AE) మొత్తం 841 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ 8 సెప్టెంబర్. ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటున్నారో వారు LIC అధికారిక వెబ్‌సైట్ licindia.in ని సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు.

READ ALSO: Monsoon Mosquito Prevention: వర్షాకాలంలో దోమల బెడద.. ఈ చిట్కాలు పాటిస్తే అస్సలు కుట్టవు..!

ఏయే పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలి..
ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 841 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ఇంజనీర్ (AE) పోస్టులు 81, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్పెషలిస్ట్) పోస్టులు 410, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (జర్నలిస్ట్) పోస్టులు 350. ఈ పోస్ట్‌లకు అక్టోబర్ 3 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. అందులో ఉత్తీర్ణులైన వారికి నవంబర్ 8 మెయిన్స్ పరీక్ష ఉంటుంది.

అర్హతలు ఏంటంటే..
ఈ పోస్టులకు దరఖాస్తుదారులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. మీరు AAO (స్పెషలిస్ట్) కోసం దరఖాస్తు చేసుకుంటుంటే మీరు ICAI చివరి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి లేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ICSI) లో సభ్యుడిగా ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయస్సు 21 ఏళ్లు. మీ గరిష్ట వయస్సు 32 ఏళ్ల కంటే ఎక్కువగా ఉండకూడదు. రిజర్వ్డ్ కేటగిరీ SC, ST, OBC, PwBD అభ్యర్థులకు వయో సడలింపు ఉంది. SC, ST లేదా PwBD వర్గాలకు రూ.85, మిగతా అన్ని వర్గాల వారికి దరఖాస్తు ఫీ రూ.700.

మూడు దశల్లో ఎంపిక
ఈ పరీక్షకు మూడు దశల్లో ఎంపిక జరుగుతుంది. మొదటి దశ ప్రిలిమ్స్ పరీక్ష. ఇది ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. రెండవ దశ మెయిన్స్ పరీక్ష. ఇది మరింత వివరంగా ఉంటుంది. మూడోది చివరి దశ ఇంటర్వ్యూ. ఇందులో మీ వ్యక్తిత్వం, జ్ఞానాన్ని పరీక్షిస్తారు.

జీతం ఎంత వస్తుందంటే..
LIC ఉద్యోగానికి ఎంపికైతే మొదటి నెల నుంచే రూ.88,635 నుంచి రూ.1,26,000 వరకు జీతం లభిస్తుంది. ఇది కాకుండా HRA, DA వంటి ఇతర అలవెన్సుల ప్రయోజనాలు కూడా ఉంటాయి.

దరఖాస్తు విధానం..
దరఖాస్తు చేసుకోవడానికి, ముందుగా LIC licindia.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. అక్కడ, కెరీర్స్ విభాగంలో, LIC AE / AAO రిక్రూట్‌మెంట్ 2025 లింక్‌‌పై క్లిక్ చేయాలి. దాని తర్వాత ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను సృష్టించుకోవాలి, ఫారమ్‌లో మీ అన్ని వివరాలను సరిగ్గా నింపి, డిగ్రీ, ఫోటో, సంతకం వంటి అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. తర్వాత దరఖాస్తు రుసుము చెల్లించి, ఫామ్‌ను సబ్మిట్ చేయాలి. చివరగా దరఖాస్తు చేసిన ఫామ్‌ను ప్రింటవుట్ తీసుకోవాలి. ఎందుకుంటే ఇది ఎగ్సామ్ టైంలో ఉపయోగపడుతుంది.

READ ALSO: UP Samosa Fight: సమోసా తీసుకురాని భర్త.. పొట్టుపొట్టు కొట్టిన భార్య

Exit mobile version