దిగ్గజ జీవిత బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కోట్లాది మంది పాలసీదారులను కలిగి ఉంది. గ్యారంటీ రిటర్స్న్ వస్తుండడంతో ఎల్ఐసీలో పెట్టుబడి పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశంలోనే అతిపెద్ద సంస్థాగత పెట్టుబడిదారు. ఇది మార్కెట్లో అత్యధికంగా పెట్టుబడి పెడుతుంది. LIC అనే పేరు వినగానే మీకు బీమా పాలసీలు గుర్తుకు రావచ్చు. కానీ LIC కేవలం బీమా పాలసీలనే కాకుండా వివిధ కేటగిరీల్లో మ్యూచువల్ ఫండ్ పథకాలను కూడా అందిస్తుంది. LIC దగ్గర కనీసం ఐదు మ్యూచువల్ ఫండ్లు ఉన్నాయి. అవి 10 సంవత్సరాలలో తమ పెట్టుబడిదారులకు 12% నుంచి 16% వార్షిక రాబడిని అందించాయి. 10 సంవత్సరాల క్రితం ఈ LIC మ్యూచువల్ ఫండ్ పథకాలలో పెట్టుబడి పెట్టిన వారి పెట్టుబడులు నేడు నాలుగు రెట్లు పెరిగాయి.
Also Read:Siddaramaiah: డీకే వ్యాఖ్యలకు కౌంటర్‌గా సిద్ధరామయ్య సంచలన ట్వీట్..
LIC మ్యూచువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్
LIC మ్యూచువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ 10 సంవత్సరాలలో 16.14% రాబడిని అందించింది. అంటే 10 సంవత్సరాల క్రితం రూ.1 లక్ష ఒకేసారి పెట్టుబడి పెట్టిన వ్యక్తి ఇప్పుడు రూ.446,497 పెట్టుబడిని కలిగి ఉంటాడు. SIP నిర్వహించిన వారికి ఈ ఫండ్ 10 సంవత్సరాలలో 21% రాబడిని అందించింది.
LIC మ్యూచువల్ ఫండ్ నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్
ఈ LIC ఫండ్ 10 సంవత్సరాలలో 13.31% రాబడిని అందించింది. అంటే 10 సంవత్సరాల క్రితం రూ.1 లక్ష పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారుడి డబ్బు రూ.348,885కి పెరగింది.
LIC మ్యూచువల్ ఫండ్ లార్జ్ & మిడ్‌క్యాప్ ఫండ్
LIC మ్యూచువల్ ఫండ్ లార్జ్ & మిడ్‌క్యాప్ ఫండ్ 10 సంవత్సరాలలో 15.96% రాబడిని ఇచ్చింది. 10 సంవత్సరాల క్రితం ఈ ఫండ్‌లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టిన వారి డబ్బు రూ.4,39,625కి పెరిగింది.
LIC మ్యూచువల్ ఫండ్ టాక్స్ సేవర్ ఫండ్
LIC నుంచి వచ్చిన ఈ టాక్స్ సేవర్ ఫండ్ 10 సంవత్సరాలలో ఒకేసారి పెట్టుబడిపై 12.70% రాబడిని అందించింది. 10 సంవత్సరాల క్రితం రూ.1 లక్ష పెట్టుబడి పెట్టిన వారి డబ్బు రూ.3,30,552కి పెరిగింది.
