LIC HFL 2024: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ ద్వారా జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులందరూ ఈ ఖాళీకి దరఖాస్తు చేసుకోవచ్చు. వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులు ఈ ఉద్యోగుల ఎంపిక ఉంటుంది. దీని కోసం ఆన్‌లైన్ దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 14 ఆగస్టు 2024. హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులందరూ ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను చివరి తేదీకి ముందు https://www.lichousing.com/ లో పూర్తి చేయాలి.
QR Code Scanner Alert: వ్యాపారులు అలెర్ట్.. కొత్త తరహా మోసం షురూ.. జాగ్రత్త సుమీ.. (వీడియో)
ఎల్‌ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, అవసరమైన పత్రాలు, జీతం ఇలా పూర్తి వివరాలను ఒకసారి చూద్దాం. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ మొత్తం 200 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను దాదాపు అన్ని రాష్ట్రాలకు విడుదల చేసింది. ఇందులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 1, మహారాష్ట్రకు 53, మధ్యప్రదేశ్‌కు 12, కర్ణాటక 38, తెలంగాణకు 31, తమిళనాడుకు 10, ఆంధ్రప్రదేశ్ కు 12 పోస్టులు ఉన్నాయి.
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. అలాగే అభ్యర్థికి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. అంతేకాకుండా ఏదైనా కంప్యూటర్ కోర్సులో డిప్లొమా లేదా డిగ్రీ కలిగి ఉండాలి. పని అనుభవం ఉన్న అభ్యర్థులకు ఇందులో ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 32000 నుండి 35000 వరకు జీతం ఇవ్వబడుతుంది. ఉద్యోగం పోస్టింగ్ చేసే ప్రదేశంపై జీతం ఆధారపడి ఉంటుంది. అధికారిక నోటిఫికేషన్ నుండి మరింత సమాచారాన్ని పొందండి. అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ. 800 + 18% జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.