Site icon NTV Telugu

LIC Dhan Vriddhi Scheme: ఎల్‌ఐసీ నుంచి ధన్‌ వృద్ధి పాలసీ.. ప్రయోజనాలు ఇవే..!

Lic Policy

Lic Policy

ప్రభుత్వ ఇన్సూరెన్స్ సంస్థ ఎల్‌ఐసీ ఎప్పటికప్పుడు కొత్త పథకాలను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. తాజాగా ప్రారభించిన ధన్‌ వృద్ధి పాలసి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది.. ఇది పదేళ్ల కాలపరిమితి కలిగిన పథకం..ఈ కొత్త ప్లాన్‌ను ఎల్‌ఐసీ ఇటీవల ప్రారంభించింది. ఇది క్లోజ్ ఎండెడ్ ప్లాన్. మీరు ఈ ప్లాన్‌లో 10 నుంచి 18 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ప్లాన్‌ను జూన్ 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు పొందవచ్చు. ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ వ్యక్తిగత పొదుపు ప్లాన్. ఇది జీవిత బీమా సింగిల్-ప్రీమియం పాలసీ. ఇది పాలసీ వ్యవధిలో పొదుపులు, రక్షణ భీమాను అందిస్తుంది..

ఈ పాలసీ రూ. 1000 హామీ మొత్తంపై రూ. 75 వరకు అదనపు హామీని ఇస్తుంది. పాలసీదారు సెక్షన్ 80-సి కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. అంటే, పాలసీని కొనుగోలు చేసిన బీమాదారుడు రూ.1.5 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు. ఎల్‌ఐసీ ధన్ వృద్ధి పాలసీకి కనీస హామీ మొత్తం రూ. 1.25 లక్షలు. దీని తర్వాత 5 వేల రూపాయల వరకు పెంచుకునే వెలసుబాటు ఉంది.. ఇకపోతే ఇది సింగిల్ ప్రీమియం పాలసీ.. డెత్‌ బెనిఫిట్‌తో పాటు మెచ్యూరిటీ సమయానికి గ్యారంటీతో పాటు మంచి లాభాలను కూడా పొందవచ్చు..

అయితే,కనీసం 90 రోజుల నుంచి 8 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు ధన్ వృద్ధి పథకం తీసుకోవడానికి అర్హులు. 32 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయస్సు గల వారు ఈ పాలసీని తీసుకోవచ్చు… ఈ పాలసీ తీసుకున్న 3 నెలలకే లోన్ తీసుకొనే సదుపాయం కూడా ఉంది.. ఇది 10, 15 లేదా 18 సంవత్సరాలకు అందుబాటులో ఉన్నాయి. పాలసీదారుడు పాలసీ వ్యవధిలో ఎప్పుడైనా సరెండర్ చేయవచ్చు. అంటే అతను ఎప్పుడైనా పాలసీ నుండి నిష్క్రమించవచ్చు.. పాలసీ తీసుకున్న సమయంలో బీమా చేసిన వ్యక్తికి గ్యారెంటీతో పాటు మొత్తం అందుతుంది.. ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని తెలుస్తుంది..

Exit mobile version