NTV Telugu Site icon

LIC Credit Card : ఎల్ఐసీ క్రెడిట్ కార్డు.. ఈ కార్డు బెనిఫిట్స్ ఏంటో తెలుసా?

Licc

Licc

ఈమధ్య డెబిట్ కార్డుల కన్నా క్రెడిట్ కార్డుల వినియోగం బాగా పెరిగింది.. కస్టమర్లకు అనేక ఆఫర్స్ ఇస్తూ కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డులను అందిస్తున్నారు.. అంతేకాదు ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు కూడా క్రెడిట్ కార్డులను ఇస్తున్నారు.. ఇదే క్రమంలో ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కూడా క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. దీనిపై ప్రమాద బీమాతో పాటు ఆకర్షణీయమైన ప్రయోజనాలను కూడా అందిస్తుంది.. ఎల్‌ఐసీ, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌, మాస్టర్‌ కార్డులు కలిసి సంయుక్తంగా ఈ క్రెడిట్‌ కార్డులను ప్రారంభించాయి.

ఈ ఎల్‌ఐసీ క్లాసిక్‌, ఎల్‌ఐసీ సెలక్ట్‌ పేరుతో రెండు క్రెడిట్‌ కార్డులు లాంచ్‌ అయ్యాయి. ఈ క్రెడిట్ కార్డుల ద్వారా యూజర్లకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తున్నాయి.. ఐదు లక్షల ప్రమాద బీమా ను కూడా పొందవచ్చు అని ఎల్ఐసీ ప్రతినిధులు చెబుతున్నారు..ఎటువంటి ఫీజు లేదు, అలాగే వడ్డీ కూడా తక్కువగానే ఉంది.. ఈ ఎల్ఐసీ క్రెడిట్ కార్డు గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

*. ఈ ఎల్‌ఐసీ క్లాసిక్‌ క్రెడిట్ కార్డుకు ఎలాంటి జాయినింగ్ ఫీజు, వార్షిక ఫీజు ఉండవు.
*. అంతేకాదు 48 రోజుల వరకు అన్ని ఏటీఎంలలో క్యాష్‌ విత్‌డ్రాయల్‌పై ఎలాంటి ఛార్జీలు ఉండవు.
ఈ క్రెడిట్‌ కార్డుతో తొలి ఈఎమ్‌ఐపైన 5 శాతం క్యాష్‌బ్యాక్‌.
*. రూ. 399 విలువైన 6 నెలల ఫార్మ్‌ఈజీ ప్లస్‌ మెంబర్‌ షిప్‌.
*. ఎల్‌ఐసీ క్లాసిక్‌ క్రెడిట్ కార్డుపై రూ.2 లక్షల ప్రమాద బీమా
*. ఎల్‌ఐసీ సెలక్ట్‌ క్రెడిట్ కార్డుకు కూడా ప్రవేశ, వార్షిక ఛార్జీలు లేవు.
*. ట్రావెల్‌లో డొమెస్టిక్‌ ఫైట్‌లను బుక్‌ చేసుకుంటే రూ. 500 డిస్కౌంట్‌.
*. లెన్స్‌కార్ట్‌ గోల్డ్‌ సభ్యత్వం ఉచితంగా పొందొచ్చు.
భారతదేశంలోని అన్ని ఇంధన స్టేషన్స్‌లో ప్రతి నెల రూ. 300 ఇంధన సర్‌ఛార్జ్‌పై 1 శాతం తగ్గింపు..
*. ఐదు లక్షల ప్రమాద భీమా కూడా ఉంటుంది..
ఇవే కాదు మరెన్నో బెనిఫిట్స్ కూడా ఉన్నాయి..