Site icon NTV Telugu

Letters War: ఏపీలో లేఖల యుద్దం.. అమర్నాథ్ వర్సెస్ హరిరామజోగయ్య

Lekha 1

Lekha 1

ఏపీలో అసలేం జరుగుతోంది? ఒకవైపు టీడీపీ, వైసీపీ నేతల మాటల యుద్ధం జరుగుతుంటే.. మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య వర్సెస్ మంత్రి గుడివాడ అమర్నాథ్ మధ్య లేఖల యుద్ధం చోటుచేసుకుంది. హరిరామజోగయ్యకు మంత్రి అమర్‌నాథ్ రెండో లేఖ రాశారు. టీడీపీ, జనసేన పొత్తు విషయంలో ఇద్దరి మధ్య లేఖల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. వంగవీటి రంగాను చంపించింది చంద్రబాబేనని మీరే పలుమార్లు విమర్శించారు, అలాంటి చంద్రబాబుతో పవన్ పొత్తుని మీరు సమర్థిస్తారా? అని అమర్‌నాథ్ లేఖలో మండిపడ్డారు.

 

గతంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ రాసిన లేఖ ఇది. కాపుల భవిష్యత్తు విషయములో చంద్రబాబుతో జతకడుతున్న పవన్ కళ్యాణ్ గార్కి రాయవలసిన, చెప్పవలసిన విషయాలు పొరపాటున నాకు రాశారు. మీకు ఆయురారోగ్యాలతో పాటు ,మీరు మానసికంగా దృఢంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మీ గుడివాడ అమర్నాథ్ అంటూ ఈ నెల 5వ తేదీన లేఖ రాశారు.

మాజీ ఎంపీ, కాపునేత చేగొండి హరిరామ జోగయ్య అంతకుముందు లేఖ రాయడంతో హీట్ మరింత పెరిగింది. అమర్నాథ్ ఓ బచ్చా…..సాధారణ మంత్రిపదవి కోసం అమ్ముడుపోయాడు….అంటూ ఘాటైన పదాలు ప్రయోగించారు చేగొండి.అమర్నాథ్ వ్యాఖ్యలు, లేఖలపై జనసేన నిరసనలకు దిగింది. జగన్మోహన్ రెడ్డికి అమర్నాథ్ బానిసగా మారారని….విజ్ఞత,విచక్షణ లేకుండా మాట్లాడుతున్న మంత్రిని ఉపేక్షించేది లేదని ఫైర్ అయింది.మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలపై జనసేన ఆగ్రహం వ్యక్తం చేసింది.

భీమిలీ నియోజకవర్గ కార్యాలయంలో వినూత్న నిరసన తెలిపారు జనసేన నేతలు. అమర్నాధ్ దిష్టి బొమ్మ కు నిమ్మకాయలు దండలు వేసి నిరసన తెలిపారు. హరి రామ జోగ్యయకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మొత్తంగా కాపుల రాజకీయ అవసరాలు, వాటిని నెరవేర్చే దిశ గా వైసీపీ ప్రభుత్వం తీసుకున్న చొరవ, భవిష్యత్ పరిణామాలపై ఇప్పు డు ప్రధానంగా చర్చ జరుగుతోంది. అదే సమయంలో మంత్రి అమర్నాథ్ ను మరింత టార్గెట్ చెయాలనే కీలక నిర్ణయం జనసేన తీసుకుంది.

Read Also:Ponnam Prabhakar: రాజకీయ స్వార్థం కోసం గోదావరి నీళ్లను కేసీఆర్ బలి చేస్తున్నారు

Exit mobile version