NTV Telugu Site icon

Health Tips: విరిగి చెట్టు.. తగ్గని వ్యాధులకు తగిన ఔషధం

Virigi Tree

Virigi Tree

Health Tips: అలోపతి మందులకు అలవాటు పడిన జనాలు.. ప్రకృతి ఎన్నో సహజ సిద్దమైన ఔషధాలని అందించిన విషయాన్నే మర్చిపోయాం. ఎన్నో ఔషధ మొక్కలు మన చుట్టూ పెరుగుతున్నాయి. కానీ మనం వాటి విలువ తెలియక పిచ్చి మొక్కలు అనుకుని పట్టించుకోవడం లేదు. ఆ కోవలోకే వస్తుంది విరిగి చెట్టు. పల్లెటూర్లలో విరివిగా కనిపించే ఈ చెట్టుని విరిగి చెట్టు, నక్కెర కాయల చెట్టు, బంక కాయల చెట్టు అని ప్రాంతాన్ని బట్టి రకరకాలుగా పిలుస్తుంటారు. వీటి ఫలాలు బంకగా ఉంటాయి. అందుకే వీటిని బంక కాయల చెట్టు అని కూడా అంటారు. ఇక ఈ చెట్టు ఉపయోగాలు అన్నీఇన్నీ కాదు.

Read Also: Nipah Virus: అసలేంటి “నిపా వైరస్”.. దీనికి చికిత్స ఉందా..?

విరిగిపండ్లలో ఫైబర్, క్యాల్షియం,ఐరన్, పాస్పరస్ వంటి సహజ పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. విరిగి పండ్లని తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. దీనివల్ల ప్రమాదకర డయాబెటిస్ వ్యాధి నుండి రక్షణ పొందవచ్చునని అనేక పరిశోధనల్లో తేలిందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఈ చెట్టులో అణువణువూ ఔషధగుణాలని కలిగి వుంది.

Read Also: SL vs PAK: కొలంబోలో భారీ వర్షం.. శ్రీలంక-పాకిస్తాన్ మ్యాచ్ మరింత ఆలస్యం..!

ఈ చెట్టు లేత ఆకులు తలకి కట్టుకుంటే తలనొప్పి నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది. అలానే చర్మ వ్యాధులతో బాధ పడేవారు.. ఈ చెట్టు బెరడుని ఎండబెట్టి మెత్తటి పొడిగా చేసి ఆ పొడిని చర్మం పైన పూయడం వల్ల చర్మ వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. దగ్గు, జలుబు, అజీర్తి, మలబద్దకం, గ్యాస్ ట్రబుల్, బీపీ, పురుషుల్లో వీర్యకణాల అభివృద్ధి మొదలైన ఎన్నో వ్యాధులకు విరిగి చెట్టు కాండం, ఆకులు, పండ్లు ఎంతో ఉపయోగ పడతాయి.