Site icon NTV Telugu

Leopard: ఫాంహౌజ్‌లో చిరుత కలకలం.. ఎక్కడంటే..!

Leopard

Leopard

Delhi: ఫాంహౌజ్‌లో చిరుత పులి సంచారం కలకలం రేపింది. న్యూఢిల్లీలోని సైనిక్ ఫాంహౌజ్‌లో శుక్రవారం రాత్రి వాహనదారులకు కంటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక చిరుత సంచారంతో భయాందోళనకు గురైన స్థానికులు ఆటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఆటవీ శాఖ సిబ్బంది, పోలీసులు శనివారం ఉదయం ఫాంహౌజ్‌ చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read: Supreme Court: మహిళపై రేప్ కేసు పెట్టవచ్చా..? పరిశీలిస్తామన్న సుప్రీం..

ఈ క్రమంలో ఫాంహౌజ్‌కు కొద్ది దూరంలో చిరుత వారి కంటపడిందని, అది గోడ దూకి అడవిలోకి వెళ్లినట్టు ఫారెస్ట్ అధికారి సుబోధ్ కుమార్ తెలిపారు.దీంతో స్థానికులను అప్రమత్తం చేశామన్నారు. చిరుత కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి..ఫాంహౌజ్‌లో రెండు కేజ్‌ను ఏర్పాటు చేశామన్నారు. అనంతరం ఎవరూ కూడా ఫాంహౌజ్ వైపు వెళ్లకూడదని స్థానికులను హెచ్చరించామన్నారు. అయితే ఈ చిరుత పూర్తిగా ఎదిగిందని, దాదాపు 80 నుంచి 90 కిలోల బరువు ఉంటుందని సుబోధ్ కుమార్ తెలిపారు.

Also Read: Actress Subbalakshmi: సీనియర్ నటి సుబ్బలక్ష్మి చివరి క్షణాలు.. వీడియో షేర్ చేసిన మనవరాలు

Exit mobile version