Leopard : సంగారెడ్డి జిల్లా కల్హేర్‌లో చిరుత కలకలం.. బీబీపేట్ గ్రామంలో భయాందోళనలు
- ఇంట్లోకి చొరబడిన చిరుత
- కుటుంబ సభ్యులు భయంతో బయటకు పరుగులు
- సీసీ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్… గ్రామంలో కలకలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Leopard : సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలోని బీబీపేట్ గ్రామంలో శనివారం ఉదయం చిరుతపులి కనిపించడంతో గ్రామంలో తీవ్ర కలకలం రేగింది. స్థానికంగా మాజీ జడ్పీటీసీ సభ్యుడు గుండు మోహన్ ఇంట్లోకి చిరుత చొరబడి కొంతసేపు అక్కడే సంచరించిన దృశ్యాలు ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ వీడియోలు ఇప్పుడు గ్రామంలో వైరల్ అవుతున్నాయి. ఇంటి ఆవరణలో చిరుత కనిపించగానే గుండు మోహన్ కుటుంబ సభ్యులు భయాందోళనకు గురై తక్షణమే ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. వెంటనే గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించి సహాయం కోరారు.
Kalpika : సినీ నటి కల్పికపై మరో కేసు నమోదు
Also Read
- Devipatnam Tiger Attack: పోలవరం జిల్లాలో పెద్దపులి బీభత్సం.. 14 దూడలను చంపిన పులి!
- ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
- DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
- Praggnanandhaa Beat Magnus Carlsen: ఒకే టోర్నీలో రెండుసార్లు.! ప్రపంచ నెం.1 కార్ల్సెన్కు మరో ఓటమిని రుచి చూపిన ప్రజ్ఞానంద..
అప్పటికే పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ చిరుతను బయటకు పంపేందుకు గ్రామస్థులు ప్రయత్నాలు ప్రారంభించారు. చిరుత ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకెవరిపైదైనా దాడి చేస్తుందా? అన్న ఆందోళనలు గ్రామంలో పెరిగిపోతున్నాయి. పిల్లల్ని బయటకు పంపేందుకు గ్రామస్థులు భయపడుతున్నారు. వెంటనే చిరుతను పట్టుకుని అడవిలో విడిచి పెట్టాలని స్థానికులు అటవీశాఖను డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అటవీశాఖ అధికారులు గ్రామానికి చేరుకొని చిరుత తాలూకు గల్లంతైన దిశలో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బృందాలతో కలిసి చిరుతను పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామస్థులు అయితే ఇంకా భయాందోళన నుంచి తేరుకోలేని స్థితిలో ఉన్నారు.
Minister Narayana: ఆ ఇద్దరి వ్యాఖ్యల వెనుక జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉంది..
తాజావార్తలు
-
Cocktail 2 Trailer: ట్రయాంగిల్ లవ్ స్టోరీలో రష్మిక మందన్నా.. యూత్‌ను అట్రాక్ట్ చేస్తున్న ట్రైలర్
-
Devipatnam Tiger Attack: పోలవరం జిల్లాలో పెద్దపులి బీభత్సం.. 14 దూడలను చంపిన పులి!
-
Michael Movie OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 7,000 కోట్ల మైఖేల్ జాక్సన్ బయోపిక్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
-
Rohit-Hardik: ముందు బెంగళూరుకు రండి.. రోహిత్, హార్దిక్‌కు బీసీసీఐ అల్టిమేటం!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!