NTV Telugu Site icon

LEO : ఆ అరుదైన ఘనత సాధించిన లియో మూవీ…

Whatsapp Image 2023 10 23 At 11.52.42 Am

Whatsapp Image 2023 10 23 At 11.52.42 Am

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి అలాగే స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ లియో.లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన గత చిత్రం విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో లియో సినిమా పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో సీనియర్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ విజయ్ సరసన హీరోయిన్‌గా నటించారు. లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించారు.కేవలం విజయ్ ఫ్యాన్స్ కాదు  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్  ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేశారు. వారు ఎదురుచూపులకు ఎండ్ కార్డు వేస్తూ అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ముందుగా నెగటివ్ టాక్ వచ్చిన కానీ కలెక్షన్స్ పరంగా ఈ సినిమా దూసుకుపోతుంది.. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..ఈ మూవీ అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ వెబ్ సైట్ కామ్‌స్కోర్ లో లిస్ట్ అయిన ఫస్ట్ తమిళ మూవీగా నిలిచింది.

కామ్‌స్కోర్ గ్లోబల్ చార్ట్ ప్రకారం, లియో మూవీ ప్రపంచవ్యాప్త బాక్సాఫీస్ వీకెండ్ కలెక్షన్లలో 3వ స్థానంలో ఉండగా..ఫస్ట్ ప్లేస్ లో మార్టిన్ స్కోర్సెస్ యొక్క కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, సెకండ్ ప్లేస్ లో టేలర్ స్విఫ్ట్ యొక్క ఎరాస్ టూర్ సినిమాలు ఉన్నాయి.లియో సినిమాకు 4 రోజుల్లో.. ప్రపంచవ్యాప్తంగా రూ. 400.5 కోట్లను (48 మిలియన్ డాలర్లు) వసూళ్లతో టాప్ ప్లేస్ లో ఉంది.అలాగే విజయ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.ఇక ప్రపంచవ్యాప్తంగా 2800కుపైగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మొదటిరోజు వరల్డ్ వైడ్‌గా రూ.145 కోట్ల భారీ కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.ఈ ఫెస్టివల్ వీకెండ్ కంప్లీట్ అయ్యేలోపు రూ. 1000 కోట్ల మార్క్ ను రీచ్ అవుతుందని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు.

https://twitter.com/sri50/status/1716284614996894158?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1716284614996894158%7Ctwgr%5Eb5e4c10d7adc2a3a26456c76935a5f343183180e%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F