Site icon NTV Telugu

LENIN : లెనిన్ పోస్టర్ వచ్చింది కానీ డేట్ మిస్ అయింది

Lenin

Lenin

అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని, తన తర్వాతి ప్రాజెక్ట్ లెనిన్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరి (నందు) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే, ఈ సినిమా విడుదల తేదీ విషయంలో ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. వాస్తవానికి  ‘లెనిన్’ చిత్రాన్నిఈ ఏడాది సమ్మర్ కానుకగామే 1న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు.

Also Read : PEDDI : బుచ్చి బర్త్ డే ‘పెద్ది’ స్పెషల్ వీడియో రిలీజ్

అయితే, నిన్న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా చిత్ర నిర్మాతలు ఒక సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అఖిల్ లుక్ ఆకట్టుకున్నప్పటికీ, ఎక్కడా విడుదల తేదీని ప్రస్తావించలేదు. దీంతో సినిమా పక్కాగా వాయిదా పడిందనే వార్తలు ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తున్నాయి. ఈ వాయిదా వెనుక ప్రధాన కారణం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా అని తెలుస్తోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం పెద్ది’ ఏప్రిల్ 30న విడుదల కానున్నట్లు నిన్ననే అధికారిక ప్రకటన వచ్చింది. ‘పెద్ది’ విడుదలైన మరుసటి రోజే (మే 1న) అఖిల్ ‘లెనిన్’ రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే, ‘పెద్ది’ వంటి భారీ పాన్ ఇండియా సినిమాతో పోటీ పడటం రిస్క్ అని భావించిన మేకర్స్, ‘లెనిన్’ విడుదలను వాయిదా వేసినట్లు సమాచారం. ప్రస్తుతానికి కొత్త విడుదల తేదీపై చిత్ర యూనిట్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ‘పెద్ది’ హవా తగ్గిన తర్వాత మే నెల చివరిలో లేదా జూన్‌లో అఖిల్ ‘లెనిన్’ థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. అఖిల్ తన కెరీర్‌లో అత్యంత వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తున్న ఈ సినిమా అక్కినేని అభిమానులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్రబృందం ధీమాగా ఉంది.

Exit mobile version