NTV Telugu Site icon

Diwali Holiday in US: అమెరికాలో ఫెడరల్ హాలీడేగా దీపావళి!

Diwali Holiday In Us

Diwali Holiday In Us

Diwali Holiday in US: భారత ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే దీపాల పండుగ దీపావళికి ఇకపై అగ్రరాజ్యమైన అమెరికాలో కూడా అధికారిక సెలవు ఇవ్వబోతున్నారు. ఇదేలా సాధ్యం అనుకుంటున్నారా? అమెరికాలో దీపావళిని ఫెడరల్‌ హాలీడేగా ప్రకటించాలని కోరుతూ అమెరికా చట్ట సభ్యురాలు ఒకరు ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టారు. ప్రతినిధుల సభలో శుక్రవారం గ్రేస్‌ మెంగ్‌ ఈ ప్రత్యేక బిల్లును ప్రవేశ పెట్టారు. గ్రేస్‌ మెంగ్‌ ప్రతిపాదనను కొందరు చట్టసభ్యులతోపాటు అమెరికాలోని భారతీయ కమ్మూనిటీ హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ బిల్లు తొలుత పార్లమెంటులో పాస్ కావల్సి ఉంటుంది. ఆ తరువాత అధ్యక్ష్యుడు సంతకంతో చట్టం అవుతుంది. ఒకవేళ దీపావళి పండుగను సెలవు దినంగా అమెరికా చట్టసభలో ఆమోదముద్ర పడితే అమెరికా ఫెడరల్‌ హాలీడేస్‌లో 12వది నిలువనుంది.

Read Also: 9 Years Of Narendra Modi Government: మోడీ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో చేసిందేంటి ?

గ్రేస్‌ మెంగ్‌ వర్చువల్‌గా మీడియాతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మందికి దీపావళి పండుగ ఎంతో ముఖ్యమైందని.. క్వీన్స్‌, న్యూయార్క్‌ లాంటి అమెరికా ప్రధాన నగరాల్లోని ఎన్నో కుటుంబాలు, కమ్యూనిటీలు దీపావళిని ఘనంగా నిర్వహించుకుంటాయని గ్రేస్‌ తెలిపారు. అమెరికన్‌ పౌరులు సైతం దీపావళి వేడుకల్లో హుషారుగా పాల్గొనడం చూస్తున్నామన్నారు. దీపావళి వెలుగులు ప్రజల్లో కొత్త ఉత్తేజాన్ని నింపుతాయన్నారు. ఈ నేపథ్యంలోనే దీపావళిని ఫెడరల్‌ హాలీడేగా ప్రకటించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ ప్రతిపాదనపై సౌత్‌ ఏషియా కమ్యూనిటీతోపాటు పలువురు చట్టసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. న్యూయార్క్‌కు చెందిన మరో చట్ట సభ్యురాలు జెన్నిఫర్‌ కూడా దీపావళిని అధికారిక సెలవు దినంగా గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికాలో 40 లక్షల మంది దీపావళి వేడుకల్లో పాల్గొంటున్నారనే విషయాన్ని గుర్తు చేశారు. న్యూయార్క్‌ సెనెటర్‌ జెర్మీ కూనీ, న్యూయార్క్‌ సిటీ కౌన్సిల్‌మ్యాన్‌ శేఖర్ క్రుష్ణన్‌ సైతం ఈ బిల్లును స్వాగతించారు. శేఖర్‌ క్రుష్ణన్ న్యూయార్క్‌ ప్రభుత్వానికి ఎన్నికైన తొలి ఇండియన్‌ అమెరికన్‌. అమెరికా అధ్యక్ష భవనమైన వైట్‌ హైజ్లోనూ దీపావళి వేడుకలు జరుగుతుండటం చూస్తున్నాం. అమెరికాలో పబ్లిక్‌ హాలీడేస్‌(నేషనల్‌ హాలీడేస్‌)తోపాటు ప్రత్యేక సెలవులుగా ఫెడరల్‌ హాలీడేస్‌ కూడా ఉంటాయి. అమెరికాలో ప్రస్తుతం 11 ఫెడరల్‌ హాలీడేస్‌ ఉన్నాయి. ఇపుడు దీపావళికి కూడా ఫెడరల్ హాలీడే ఇస్తే 12వ ఫెడరల్‌ హాలీడేగా గుర్తింపు పొందనుంది. ప్రస్తుతం కొనసాగుతున్న 11 ఫెడరల్‌ హాలీడేస్‌లో న్యూ ఇయర్‌, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జయంతోత్సవాలు, వాషింగ్టన్‌ బర్త్‌డే, మెమొరియల్‌ డే, జూన్‌టీన్త్‌ నేషనల్ ఇండిపెండెన్స్‌ డే, ఇండిపెండెన్స్‌ డే, లేబర్‌ డే, కొలంబస్‌ డే, వెటరన్స్‌ డే, థాంక్స్‌ గివింగ్‌ డే, క్రిస్మస్‌ డే ఉన్నాయి. ఇపుడు దీపావళికి ఫెడరల్‌ హాలీడేగా ప్రకటిస్తే 12వ ఫెడరల్‌ హాలీడేగా నిలవనుంది.