NTV Telugu Site icon

Lebanon – Israel: బాంబు దాడిలో 100 మందికి పైగా మరణం.. ఏడుగురు కమాండర్లను కోల్పోయిన హెజ్‌బొల్లా!

Lebanon Israel

Lebanon Israel

Lebanon – Israel: మధ్యప్రాచ్య దేశమైన లెబనాన్‌పై ఇజ్రాయెల్ ఆదివారం నాడు వరుస బాంబు దాడులను కొనసాగించింది. ఈ దాడిలో హిజ్బుల్లా గ్రూపుకు చెందిన 100 మందికి పైగా మరణించినట్లు సమాచారం. లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రధాన దక్షిణ నగరం సిడాన్ సమీపంలో జరిగిన ఘోరమైన వైమానిక దాడిలో 107 మంది మరణించారు. ఘటనలో ఏకంగా 359 మంది గాయపడ్డారు. తూర్పు, దక్షిణ, బీరుట్ పరిసర ప్రాంతాలలో ఎక్కువ మరణాలు సంభవించాయి. ఇందులో ఓ ఫ్రెంచ్ పౌరుడు కూడా మరణించాడు. ఇరాన్ మద్దతుగల సాయుధ గ్రూప్ హిజ్బుల్లా యొక్క సెంట్రల్ కౌన్సిల్ డిప్యూటీ హెడ్ నబిల్ కౌక్ ఆదివారం ఇజ్రాయెల్ బాంబు దాడిలో మరణించారు. బృందం అతని మరణాన్ని ధృవీకరించింది. కౌక్‌తో పాటు, గ్రూప్‌లోని 7 మంది కీలక కమాండర్లు ఒక వారంలో ఇజ్రాయెల్ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం జరిగిన దాడిలో కౌక్‌తో పాటు హసన్ నస్రల్లాతో పాటు మరో సీనియర్ కమాండర్ అలీ కరాకీ కూడా మరణించారు.

Zumba Exercise: సరదాగా బరువు తగ్గాలనుకుంటున్నారా.? అయితే సొల్యూషన్ ‘జుంబా’!

లెబనీస్ మీడియా కూడా సెంట్రల్, తూర్పు, పశ్చిమ బెకాలో అనేక దాడులను నివేదించింది. ఇజ్రాయెల్ పౌరులు నివసించే భవనాలను లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. దక్షిణాదిలో రెండు రోజుల్లో కనీసం 14 మంది వైద్యులు మరణించారని లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదించింది. సెంట్రల్ బీరుట్‌లో బహుళ అంతస్తుల నివాస భవనంపై దాడి జరిగింది. దాడి సమయంలో భవనం సమీపంలో చాలా మంది జనం ఉన్నారు. ఇటీవలి దాడికి ప్రతిస్పందనగా.. లెబనాన్‌తో పాటు ఇజ్రాయెల్ దళాలు కూడా ఆదివారం 12 కంటే ఎక్కువ విమానాలతో యెమెన్‌ లోని హౌతీ స్థానాలపై దాడి చేశాయి. ఇజ్రాయెల్ యెమెన్‌ లోని హొడైడాలో పవర్ ప్లాంట్, సీ పోర్ట్ సౌకర్యాలపై దాడి చేసింది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు శనివారం బెన్ గురియన్ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు హౌతీలు బాలిస్టిక్ క్షిపణి దాడిని ప్రారంభించారు. దీనిపై ఇజ్రాయెల్ స్పందించింది.

iphone Prices Drop: భారీగా తగ్గిన ‘యాపిల్’ ధరలు.. ఈ సేల్‌ను అస్సలు మిస్ కావొద్దు!

ఇజ్రాయెల్, హమాస్ మధ్య పోరాటంలో దూకిన లెబనాన్ ఈ యుద్ధంలో చాలా నష్టపోతోంది. రెండు వారాలలోపు యుద్ధంలో దేశంలో 1,030 మంది మరణించారు. వీరిలో 156 మంది మహిళలు, 87 మంది పిల్లలు ఉన్నారు. దీంతో పాటు లక్షలాది మంది ఇళ్లు కోల్పోయారు. 2.5 లక్షల మంది షెల్టర్ హోమ్‌లలో ఉన్నారని, 10 లక్షల మంది తమ బంధువుల ఇళ్లలో ఉంటున్నారని స్థానిక ప్రభుత్వం చెబుతోంది. గత ఏడాది అక్టోబర్ 7న మధ్యప్రాచ్యంలో యుద్ధం ప్రారంభమైంది. పాలస్తీనా సాయుధ సమూహం హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేసి 1,205 మందిని చంపింది. దీని తర్వాత ఇజ్రాయెల్ హమాస్ స్థానాలను లక్ష్యంగా చేసుకుంది. ఇందులో 41,595 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆగ్రహించిన లెబనాన్ హెజ్‌బొల్లా పాలస్తీనా పౌరులకు మద్దతుగా ఇజ్రాయెల్‌తో యుద్ధం ప్రారంభించింది.