NTV Telugu Site icon

Hassan Nasrallah Death: నస్రల్లా మరణవార్త విని.. లైవ్‌లో ఎక్కిఎక్కి ఏడ్చేసిన జర్నలిస్ట్(వీడియో)

Lebanese Journalist

Lebanese Journalist

ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లా హతమైన వార్త లెబనాన్‌లో కలకలం సృష్టించింది. ఒక లెబనీస్ జర్నలిస్ట్ లైవ్ టీవీలో రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు ఈ వార్త అందుకున్నారు. ఆమె కన్నీళ్లను ఆపుకోలేక ఎక్కిఎక్కి ఏడవడం ప్రారంభించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శుక్రవారం రాత్రి జరిగిన దాడిలో హసన్ నస్రల్లాతో సహా పలువురు హిజ్బుల్లా కమాండర్లు మరణించారని శనివారం ఇజ్రాయెల్ పేర్కొంది. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే, లెబనాన్ మరియు ఇరాన్లలో దాని స్పందన కనిపించింది.

READ MORE: RCB: కోహ్లిని రిటైన్ చేసి ఆటగాళ్లందరినీ విడుదల చేయండి.. ఆర్సీబీకి మాజీ క్రికెటర్ సలహా

లెబనీస్ జర్నలిస్ట్ “ది రష్యన్ టైమ్స్‌”తో మాట్లాడుతూ.. నస్రల్లా మరణవార్త అందుకున్న వెంటనే భావోద్వేగానికి గురయ్యారు. దీంతో ఇంటర్వ్యూను మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా మరొక వీడియో వైరల్ అయ్యింది. అక్కడ లెబనాన్ న్యూస్ ఛానెల్‌కు చెందిన యాంకర్, ప్రత్యక్ష ప్రసారంలో హసన్ నస్రల్లా మరణ వార్తను చదువుతున్నప్పు.. ఆమె భావోద్వేగాలను నియంత్రించుకోలేక ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి.

READ MORE:Udhayanidhi Stalin: డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్..మంత్రి వర్గంలో మరో నలుగురికి చోటు

ఇదిలా ఉండగా.. హసన్ నస్రల్లా మరణం తరువాత లెబనాన్‌లో ఐదు రోజుల జాతీయ సంతాప దినాలు ప్రకటించబడ్డాయి. అన్ని దుకాణాలు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అక్టోబర్ 2 వరకు మూసివేయబడతాయి. దక్షిణ బీరుట్‌లోని దహియా ప్రాంతంలోని హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ బాంబు దాడి చేయడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇరాన్‌లో.. ఈ వార్త వచ్చిన వెంటనే, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తన ఇంటిలో దేశ అత్యున్నత జాతీయ భద్రతా మండలి సమావేశాన్ని పిలిచారు.