NTV Telugu Site icon

Ileana: ఇలియానా బిడ్డకు తండ్రి అతనే..?

Illu

Illu

Ileana: దేవదాసు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన గోవా బ్యూటీ ఇలియానా. నడుము అంటే ఇలానే ఉండాలి అని ఇలియానాను చూపించేవారు అప్పట్లో అందుకే.. ఇలియానా లాంటి నడుము అని అబ్బాయిలు.. అమ్మాయిలను పొగడ్తలతో ముంచెత్తేవారు. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ.. ఒక్కసారిగా ప్రేమలో పడి.. తన జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు విదేశీ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో ప్రేమాయణం మొదలుపెటింది. ఆ ప్రేమ.. పెళ్లి వరకు వెళ్లిద్దని అనుకున్నారు. కానీ, అనుకోకుండా వారిద్దరి మధ్య విబేధాలు రావడంతో బ్రేకప్ చెప్పుకొని ఎవరికి వారు సపరేట్ అయ్యారు. ఇక ఆ దెబ్బ.. ఇలియానా మీద బాగా ప్రభావం చూపించింది. డిప్రెషన్ లోకి వెళ్లి.. లోన్లీగా మారి బరువు పెరిగింది. ఆ దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది కానీ మునుపటి రూపానికి మాత్రం రాలేకపోతుంది. అవకాశాలు తగ్గాయి.. అడపాదడపా బాలీవుడ్ మూవీస్ లో మెరుస్తూ వస్తుంది.

Agent Trailer: వైల్డ్ సాలా ఏజెంట్ వచ్చేశాడోచ్..

ఇక్కడికి వరకు బాగానే ఉన్నా ఈ మధ్య.. ఈ చిన్నది కత్రీనా సోదరుడు సెబాస్టియన్ లారెన్ మిచెల్ ప్రేమలో ఉన్నట్లు పుకార్లు పుట్టుకొచ్చాయి. కత్రీనా ఫ్యామిలీ వెకేషన్ లో అమ్మడు ప్రత్యేక్షమవ్వడం, బయట ఈవెంట్స్ లో వీరిద్దరూ జంటగా కనిపించడంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని పుకార్లు షికార్లు చేశాయి. ఇక వీరిద్దరూ అయినా త్వరలో పెళ్లి వార్త చెప్తారని ఆశించిన అభిమానులకు నేడు అంతకు మించిన షాకింగ్ న్యూస్ చెప్పుకొచ్చింది ఇల్లూ బేబీ. తానూ త్వరలో తల్లి కాబోతున్నాను అంటూ మెడలో `మామా` అంటూ పెండెంట్ లాకెట్ ప్రదర్శన.. అడ్వెంచర్ బిగిన్స్ అంటూ హింట్ ఇవ్వడం జరిగింది. ఈ పోస్ట్ పెట్టిన దగ్గరనుంచి సోషల్ మీడియాలో ఇలియానా బిడ్డకు తండ్రి ఎవరు..? అనే చర్చ మొదలయ్యింది. కొందరేమో సెబాస్టియన్ లారెన్ మిచెల్ అని చెప్పుకొస్తున్నారు. ఇక ఇంకొందరు ఏమో సరోగసీ ద్వారా బిడ్డను కంటుందేమో అని చెప్పుకొస్తున్నారు. సడెన్ గా ఇలియానాకు పెళ్లి ఎప్పుడు అయ్యింది అనే అనుమానం ఇంకొంతమందికి వచ్చింది. అసలు ఇలియానా నిజంగా గర్భవతి అయ్యిందా ..? ఏదైనా సినిమా కోసం ప్రమోషన్స్ కోసం చేస్తుందా..? అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ అభిమానుల అనుమానాలకు ఇలియానా ఎప్పుడు సమాధానం ఇస్తుందో చూడాలి.