సంక్రాంతి ఎప్పుడొచ్చినా గోదావరి జిల్లాల్లో స్పెషల్ అట్రాక్షన్ ఏదైనా ఉంది అంటే అవి కోడిపందాలే. గోదావరిజిల్లాలో కోడిపందాల నిర్వాహణకు ఒకవైపు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు పోలీసుల ఆంక్షలు, కోర్టుల ఆదేశాలున్నా పండుగ నాలుగురోజుల పాటు పందాలు నిర్వహించేందుకు అనధికార అనుమతులు వస్తాయంటున్నారు. దీంతో పందాలు నిర్వాహణకు ఈసారి రాజకీయ నాయకుల అత్యధిక ప్రాధాన్యత చూపుతున్నారు. పందాలు నిర్వహించడం ఏటా పరిపాటే అయినా.. ఎన్నికలు దగ్గరపడటంతో అన్ని నియోజకవర్గాల్లోనూ పందాల నిర్వాహణ మరింత ఇజ్జత్ కా సవాల్ గా మారింది. అక్కడి ప్రజలను ఆకట్టుకోవడం, అసంతృప్తులను బుజ్జగించే అవకాశం ఉండటంతో ప్రత్యర్ధులకు అవకాశం ఇవ్వకుండా అధికార పార్టీ నాయకులే అన్ని దగ్గరుండి మరీ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. పందాలు జరగకపోతే మా పరువు పోతుందని వారు సెంటిమెంట్ రగిలిస్తున్నారు.
సంక్రాంతి దగ్గర పడిందంటే గోదావరిజిల్లాల్లో పందెం రాయుళ్ళ హడావుడి అంతాఇంతా కాదు. పుంజులను వస్తాదుల్లా తయారు చేసే విషయంలో సర్వశక్తులు ఒడ్డుతుంటారు. పండుగ నాలుగు రోజులపాటు పల్లెలు,పట్టణాలు అనే తేడాలేకుండా పెద్ద ఎత్తున కోడిపందాలు నిర్వాహిస్తారు. ఈసారి కోడిపందాల నిర్వాహణపై రాజకీయ నాయకులు మరింత దృష్టిపెట్టారు. పందెం బరుల వద్దకు వేల సంఖ్యలో తరలివచ్చే చిన్నాపెద్దను మెప్పించే విధంగా, పందాల నిర్వాహణకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసిన నాయకులకే అక్కడ ఎక్కువ విలువ. ఈసారి పందాల నిర్వహణ సర్పంచ్ స్థాయి నుంచి మంత్రుల వరకు ప్రెస్టెజీయస్ గా మారింది. ఎన్నికల సమయం దగ్గర పడటంతో పందాల నిర్వాహణలో లోపం జరిగితే పరువు పోయే ప్రమాదం ఉందంటున్నారు.
Read Also: Cashews Benefits: ఇవి రోజూ తింటే.. పురుషుల్లో ఆ సమస్యలు దూరం
పందాల నిర్వాహణ పక్కగా చేస్తే అక్కడికి వచ్చే వారి దృష్టి తమపై ఖచ్చితంగా పడుతుందంటున్నారు. పందాల నిర్వాహణలో లోపాలు జరిగితే అసలుకే ఎసరు తెస్తుందని నాయకులు భావిస్తున్నారు. దీంతో అన్ని నియోజకవర్గాల్లోనూ కోడిపందాల నిర్వాహణ బాధ్యతలను తమ అనుచరులకు, లేదా తమ వారసులకు అప్పగిస్తున్నారు నేతలు. గోదావరిజిల్లాలోని మరికొంత మంది ఎమ్మెల్యేలు పందాల నిర్వాహణను తమ వారసుల రాజకీయ ఎంట్రీకి వేదికగా మార్చుకుంటున్నారు.
పందాలు నిర్వహించే ప్రతిఒక్కరు తమ వారుసుల అనుమతి తీసుకున్నాకే పనులు మొదలు పెట్టాలని ఇప్పటికే ఒక మంత్రి, మరో మాజీ మంత్రి సైతం ఆదేశాలు జారీ చేసారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ భారీ కటౌట్లు, ఫ్లెక్సీల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సైతం ఆదేశాలు జారీ చేశారు. ఫ్లెక్సీల తయారీ ఊపందుకుంది.
డెల్టా ప్రాంతంలోని నాయకులు మరో అడుగు ముందుకు వేసి అసంతృప్తితో ఉన్న నాయకులను బుజ్జగించడానికి కోడిపందాల వేదికలను ఉపయోగించుకుంటున్నారు. పండుగ మూడు రోజుల పాటు అసంతృప్తులను బుజ్జగిస్తే గ్రూపు తగాదాలకు చెక్ పెట్టినట్టే అని కొంత మంది నాయకులు భావిస్తుండంతో వారే దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించే పనిలో పడ్డారు. పరిస్థితులు తేడా వస్తే వచ్చే సంక్రాంతికి ముందే ముందస్తు ఎన్నికలు రావచ్చంటున్నారు.
దీంతో ఈ సంక్రాంతి అలాంటి నేతలకు కీలకంగా మారింది. పందెం బరిలో కాలు దువ్వే కోడిపంజుల సంగతి ఎలా ఉన్నా ఈసారి ఎన్నికల్లో తమ గెలుపుకోసం పందెం బరుల వద్ద ఏర్పాట్లు మాత్రం తగ్గకూడదనే ఆలోచనలో దాదాపుగా అందరు ఎమ్మెల్యేలు ఉన్నారు. సంక్రాంతికి జరిగే కోడిపందాలను అధికార పార్టీ నేతలు ప్రత్యేకంగా చూస్తున్నారు. పోలీసులు 144 సెక్షన్ అమలుచేస్తున్నారు. పోలీసులు ఎంతగా ప్రయత్నం చేసినా మూడురోజులు కోడిపందాలు జరుగుతాయంటున్నారు యువత.
Read Also: Cashews Benefits: ఇవి రోజూ తింటే.. పురుషుల్లో ఆ సమస్యలు దూరం