Site icon NTV Telugu

Layoffs : వందలమంది ఉద్యోగులను తొలగించిన ప్రముఖ కంపెనీ… కారణం ఇదే?

Layoff

Layoff

2023 లో కొన్ని న్ని క్లిష్ట పరిస్థితుల కారణంగా ప్రముఖ కంపెనీలు తమ ఉద్యోగులను తగ్గించుకొనే ప్రయత్నం చేస్తుంది.. ఇప్పటికే ఎన్నో వేల మంది ఉద్యోగాలను పోగొట్టుకున్నారు.. ఏ రంగాలకు ఎలా ఉన్నా.. టెక్ కంపెనీలకు, స్టార్టప్‌లకు కొంత నష్టమే వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఈ ఏడాదంతా కూడా చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. దేశంలో ఎన్ని స్టార్టప్‌ కంపెనీలు ఎంతో మంది ఉద్యోగులను తొలగించాయి.. ఇప్పుడు మరో ప్రముఖ కంపెనీ వచ్చి చేరింది..

అమెరికన్ టెక్ సంస్థ ఫ్రంట్‌డెస్క్ కొత్త సంవత్సరాన్ని పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపులతో ప్రారంభించింది. కంపెనీ తన 200 మంది ఉద్యోగులకు వారి తొలగింపు గురించి కేవలం రెండు నిమిషాల Google Meet వీడియో కాల్‌లో తెలియజేసి, వారితో సంబంధాలను ముగించింది.. ఈ లేఆఫ్‌తో కంపెనీ ఫుల్‌టైమ్ ఉద్యోగులతో పాటు పార్ట్‌టైమ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా నష్టపోయారు. టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం.. ఆన్‌లైన్ ప్రాపర్టీ వ్యాపారాన్ని నడుపుతున్న FrontDesk కంపెనీ నిరంతరం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభం పెరిగిన తర్వాత దాని ఖర్చులను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది..

నివేదిక ప్రకారం.. ఫ్రంట్‌డెస్క్ స్టార్టప్‌ల వ్యాపార నమూనా మార్కెట్ అద్దె ధరలకు అపార్ట్‌మెంట్‌లను లీజుకు తీసుకుని, ఆపై వాటిని సమకూర్చి, స్వల్పకాలిక అద్దెపై మరొక పార్టీకి ఇవ్వడం. కంపెనీ ఈ పనిని 30 మార్కెట్లలో చేస్తోంది. అయితే ఈ పనిలో భారీ ముందస్తు ఖర్చు కారణంగా, అది ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.. ఆ పరిస్థితుల నుంచి బయట పడటానికి ఈ ఉద్యోగాల లేఆఫ్ లను నిర్వహిస్తుందని తెలుస్తుంది.. మరి నెక్స్ట్ ఏ కంపెనీ ఆ లిస్ట్ లోకి చేరుతుందో చూడాలి…

Exit mobile version