Site icon NTV Telugu

Laxmi Parvathi: సీఎం జగన్ పాలనను మోడీనే ప్రశంసించారు.. కానీ..!

Laxmi Parvathi

Laxmi Parvathi

Laxmi Parvathi: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాలనను ప్రధాని నరేంద్ర మోడీనే ప్రశంసించారు.. ఇప్పుడు పూర్తిగా మార్పు వచ్చిందన్నారు లక్ష్మీపార్వతి.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఇక, వైఎస్సార్‌ హయాంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి జరిగిందన్నారు. నాడు వైఎస్సార్‌ అన్ని రంగాల వారిని ఆదుకున్నారని గుర్తు చేశారు.. ఇక, ఇప్పుడు కరోనా మహమ్మారి వంటి సంక్షోభంలో కూడా పేదలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌ది అని ప్రశంసించారు. వాలంటీర్‌ వ్యవస్థ సీఎం వైఎస్‌ జగన్ మానసపుత్రికగా పేర్కొన్నారు. అయితే, గత ప్రభుత్వంలో ఇసుక అమ్ముకొని నారా లోకేష్ మామూళ్లు తీసుకున్నాడు అని ఆరోపించారు లక్ష్మీపార్వతి.. బెల్ట్ షాపులు ఎత్తేస్తామని చంద్రబాబు మొదటి సంతకం చేసి.. ఇష్టమొచ్చినట్టు తాగించి దోచుకున్నాడు అని విమర్శించారు. కానీ, ఇసుక విధానంలో కూడా సీఎం వైఎస్‌ జగన్ పారదర్శకత తీసుకొచ్చారని ప్రశంసలు కురిపించారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత లక్ష్మీపార్వతి. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల సమయంలో.. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న లక్ష్మీపార్వతి.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలను ఎత్తిచూపుతూ.. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తోన్న విషయం విదితమే.

Read Also: Shakib Al Hasan: ఈ క్రికెటర్ కోపం చూశారా.. సెల్ఫీ కోసం వచ్చిన అభిమానిని ఏం చేశాడంటే..?

Exit mobile version