BCCI: ‘బీసీసీఐ నన్ను నిర్లక్ష్యం చేసింది.. రాజీనామా చేస్తున్నా’-భారత మాజీ క్రికెటర్..
- బీసీసీఐ వర్ణ వివక్ష చూపింది..
- జూనియర్లకే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చింది..
- కామెంటరీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్న లక్ష్మణ్ శివరామకృష్ణన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)లో జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు క్రీడా లోకంలో తీవ్ర చర్చకు దారితీశాయి. టీమిండియా మాజీ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ స్వయంగా బోర్డుపై సంచలన ఆరోపణలు చేస్తూ కామెంటరీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం కలకలం రేపుతోంది. గత రెండు దశాబ్దాలుగా తన గొంతుకతో అభిమానులను అలరించిన ఆయన, తన పట్ల వర్ణ వివక్ష చూపారని ఆరోపించారు.
ఆవేదనకు కారణం ఇదే..
Also Read
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
- Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
సుమారు 23 ఏళ్లుగా బ్రాడ్‌కాస్టింగ్ రంగంలో ఉన్నప్పటికీ.. బీసీసీఐ తనను కావాలనే విస్మరించిందని శివరామకృష్ణన్ వాపోయారు. ముఖ్యంగా అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో టాస్ వేయడం, అవార్డు ప్రజెంటేషన్ వంటి కీలక బాధ్యతలను తన కంటే జూనియర్లకు అప్పగించారని, తన రంగును బట్టి తనను పక్కన పెట్టారని ఆయన సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రపంచవ్యాప్తంగా నాకు గౌరవం దక్కింది కానీ, నా స్వదేశంలోనే వివక్షను ఎదుర్కొన్నాను’ అని ఆయన పేర్కొన్నారు.
మాజీ కోచ్ రవిశాస్త్రి హయాంలో కూడా పిచ్ రిపోర్ట్ వంటి బాధ్యతలకు కొత్తవారికే ప్రాధాన్యత ఇచ్చారని, సీనియర్‌గా ఉన్న తనను కనీసం పరిగణనలోకి తీసుకోలేదని ఆయన విమర్శించారు. ఎవరికో దాసోహం అయ్యి తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేనని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ వద్దని వారించినప్పటికీ, శివరామకృష్ణన్ మాత్రం తన నిర్ణయానికే మొగ్గు చూపారన్నారు. ఈ పరిణామం భారత క్రికెట్ వర్గాల్లో పెను సంచలనంగా మారింది.
తాజావార్తలు
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!