Site icon NTV Telugu

Hidma Encounter: హిడ్మా ఎన్‌కౌంటర్‌పై అనుమానం.. జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

Hidma Encounter

Hidma Encounter

Hidma Encounter: మావోయిస్టు అగ్ర నేతల్లో ఒకరైన హిడ్మా ఎన్‌కౌంటర్‌ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చగా మారింది.. అయితే, హిడ్మా ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.. హిడ్మా ఎన్‌కౌంటర్‌పై విచారణ కోరుతూ NHRCకి ఫిర్యాదు చేశారు.. మావోయిస్టు నాయకుడు హిడ్మా ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తూ న్యాయవాది కె. విజయ్ కిరణ్.. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (NHRC)ను ఆశ్రయించారు. ఎన్‌కౌంటర్ ఫేక్ అయ్యి ఉండే అవకాశంపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

Read Also: ESI Hospital : సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ ఆస్పత్రిలో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి

ఎఫ్‌ఐఆర్ నంబర్లు 52/2025 మరియు 53/2025లో అనుమానాస్పద అంశాలు ఉన్నాయని ఆరోపించారు న్యాయవాది.. NHRC గైడ్‌లైన్స్ ప్రకారం.. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని, దర్యాప్తు కూడా తటస్థ అధికారుల ద్వారా జరగలేదని పేర్కొన్నారు. హిడ్మా ఎన్‌కౌంటర్‌పై ప్రజలకు నిజాలు తెలియాలని కోరారు.. ఈ సందర్భంగా న్యాయవాది విజయ్ కిరణ్ మాట్లాడుతూ.. హిడ్మా ఎన్‌కౌంటర్‌పై అసలు సమాచారం, సాక్ష్యాలు ప్రజలకు వెల్లడించాలి. ఫేక్ ఎన్‌కౌంటర్ అయితే, అది ప్రభుత్వ నుండి జరిగిన చారిత్రక తప్పిదం అవుతుందని వ్యాఖ్యానించారు.

ఇక, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే నేరమే అన్నారు.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం మావోయిస్టులైనా, పోలీసులైనా నేరమే. ఎవరూ చట్టానికి పైబడిన వారు కాదు కాదన్నారు.. ఈ మొత్తం కేసు వ్యవహారాన్ని NHRC దృష్టికి తీసుకెళ్లారు న్యాయవాది విజయ్‌ కిరణ్‌.. అయితే, ఈ ఫిర్యాదు నేపథ్యంలో హిడ్మా ఎన్‌కౌంటర్‌పై అధికారిక దర్యాప్తు చేపడుతుందా? అన్నది ఇప్పటికీ స్పష్టత లేదు. అయితే, ఈ వ్యవహారంతో కేసు ఇప్పుడు జాతీయ దృష్టిలో పడినట్టు అయ్యింది..

Exit mobile version