NTV Telugu Site icon

Raghava Lawrence : మరోసారి గొప్ప మనసు చాటుకున్న లారెన్స్..వారికి భారీ సాయం…

Raghavaa

Raghavaa

తమిళ హీరో రాఘవ లారెన్స్ పేరుకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు.. హీరోగా, డైరెక్టర్ గా, డ్యాన్స్ మాస్టర్ గా, ప్రోడ్యూసర్ చేసి ప్రేక్షకుల మనసు దోచుకొని స్టార్ హీరో అయ్యాడు.. ఇప్పుడు జనాలకు తోచిన సాయం చేస్తూ రియల్ హీరో అయ్యాడు. మొన్న వికలాంగులకు స్కూటీలు, నిన్న రైతన్నలకు ట్రాక్టర్లు, నేడు మహిళా ఆటో డ్రైవర్లకు సాయం అందించాడు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

తాజాగా 10 మంది మహిళా ఆటో డ్రైవర్లకి లోన్లు క్లియర్ చేసి వారికి ఆర్థికంగా అండగా నిలిచారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు లారెన్స్.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఆటో డ్రైవర్లు తమ వాహనాల రుణాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది. అంతేకాక ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లుగా వారు చెప్పారు..

నటుడు బాలన్, రాఘవ స్వయంగా డాక్యుమెంట్స్ ను తీసుకెళ్లి మహిళా ఆటో డ్రైవర్లకు ఇచ్చినట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది.. లారెన్స్ చేసిన సాయానికి ఆ మహిళలు భావోద్వేగానికి గురయ్యారు. లారెన్స్‌ మెడలో దండలేసి హారతి ఇచ్చారు.. అంతేకాదు ఓ మహిళ తమ బిడ్డకు లారెన్స్ అనే పేరు కూడా పెట్టింది.. లారెన్స్ మాట్రం అనే ట్రస్ట్ ను నడుపుతున్న విషయం తెలిసిందే.. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతోమందికి అండగా నిలిస్తున్న లారెన్స్.. భవిష్యత్తులో భారీ స్థాయిలో సాయం చేయడానికి మీ అందరి ఆశీస్సులు నాకు కావాలని కోరుతున్నాడు..