Raghava Lawrence : మరోసారి గొప్ప మనసు చాటుకున్న లారెన్స్..వారికి భారీ సాయం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ హీరో రాఘవ లారెన్స్ పేరుకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు.. హీరోగా, డైరెక్టర్ గా, డ్యాన్స్ మాస్టర్ గా, ప్రోడ్యూసర్ చేసి ప్రేక్షకుల మనసు దోచుకొని స్టార్ హీరో అయ్యాడు.. ఇప్పుడు జనాలకు తోచిన సాయం చేస్తూ రియల్ హీరో అయ్యాడు. మొన్న వికలాంగులకు స్కూటీలు, నిన్న రైతన్నలకు ట్రాక్టర్లు, నేడు మహిళా ఆటో డ్రైవర్లకు సాయం అందించాడు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
తాజాగా 10 మంది మహిళా ఆటో డ్రైవర్లకి లోన్లు క్లియర్ చేసి వారికి ఆర్థికంగా అండగా నిలిచారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు లారెన్స్.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఆటో డ్రైవర్లు తమ వాహనాల రుణాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది. అంతేకాక ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లుగా వారు చెప్పారు..
Also Read
నటుడు బాలన్, రాఘవ స్వయంగా డాక్యుమెంట్స్ ను తీసుకెళ్లి మహిళా ఆటో డ్రైవర్లకు ఇచ్చినట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది.. లారెన్స్ చేసిన సాయానికి ఆ మహిళలు భావోద్వేగానికి గురయ్యారు. లారెన్స్ మెడలో దండలేసి హారతి ఇచ్చారు.. అంతేకాదు ఓ మహిళ తమ బిడ్డకు లారెన్స్ అనే పేరు కూడా పెట్టింది.. లారెన్స్ మాట్రం అనే ట్రస్ట్ ను నడుపుతున్న విషయం తెలిసిందే.. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతోమందికి అండగా నిలిస్తున్న లారెన్స్.. భవిష్యత్తులో భారీ స్థాయిలో సాయం చేయడానికి మీ అందరి ఆశీస్సులు నాకు కావాలని కోరుతున్నాడు..
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!