Site icon NTV Telugu

Raghava Lawrence : రెండు రోజుల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్..

Whatsapp Image 2024 04 18 At 8.20.52 Am(1)

Whatsapp Image 2024 04 18 At 8.20.52 Am(1)

ప్రముఖ నటుడు మరియు కొరియోగ్రాఫర్ అయిన రాఘవలారెన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. సామాజిక సేవ చేయడంలో రాఘవ లారెన్స్ ఎప్పుడూ ముందుంటాడు. రాఘవ లారెన్స్‌ అనాథలు మరియు దివ్యాంగుల కోసం ఒక ట్రస్టును ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా వారికీ సాయం చేస్తున్నాడు. లారెన్స్ తాను చేయగలిగినంత సాయం ఎప్పుడూ చేస్తూ ఉంటాడు.తాను తెరకెక్కించే మరియు నటించే సినిమాలలో దివ్యాంగులను నటింపజేస్తూ వారిలోని ప్రతిభను నిత్యం ప్రోత్సహిస్తు వుంటారు. తాజాగా తమిళ పారంపర్య కళ అయిన మల్లర్‌ కంబం అనే విలువిద్యలో దివ్యాంగులను ప్రోత్సహిస్తున్నారు. ‘కై కొడుక్కుమ్‌ కై’ అనే దివ్యాంగుల బృందం ఈ సాహస కళను పలు వేదికలపై ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకుంటోంది.. కాగా ఈ బృందం సోమవారం రాఘవలారెన్స్‌ నేతృత్వంలో చైన్నెలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో మల్లర్‌ కంబం అనే సాహస కళను ప్రదర్శించింది.వీరి కళను అందరూ ప్రోత్సహించాల్సిందిగా రాఘవలారెన్స్‌ విజ్ఞప్తి చేశారు.వారికి తాను తగినంత సాయం చేస్తున్నానని తాను నటించే చిత్రాల్లో కూడా వారికీ అవకాశం ఇస్తానని ఆయన చెప్పారు.

ప్రతి ఒక్కరు తమ ఇళ్లల్లో జరిగే వేడుకల్లో ఇలాంటి టీమ్‌కు అవకాశం కల్పించి ప్రోత్సహించాలని ఆయన కోరారు. అలాగే తాను ఈ మల్లర్‌ కంబం కళ బృందంలోని ప్రతి ఒక్కరికీ ఒక బైక్‌ని ఇస్తానని తెలిపారు.. అలాగే తాను దివ్యాంగుల ఇతి వృత్తంతో ఒక సినిమా చేస్తున్నానని అందులో తానూ దివ్యాంగుడి పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. ఆ సినిమాకు వచ్చిన లాభాలతో వీరందరికి ఇళ్లు కట్టిస్తానని రాఘవ లారెన్స్‌ మాట ఇచ్చారు .ఇలా తాను ఇచ్చిన మాటను రాఘవ లారెన్స్ రెండు రోజులలో నిలబెట్టుకున్నారు.తాజాగా మల్లర్ కంబం ప్రదర్శించిన బృందానికి బైక్‌ లను అందజేస్తున్నట్లు తెలిపారు.”హాయ్ ఫ్రెండ్స్ మరియు ఫ్యాన్స్, రెండు రోజుల క్రితం ప్రెస్ మీట్‌లో శారీరక సామర్థ్యం ఉన్నా కూడా ఆ బృందం చాలా ధైర్యంగా మల్లరకంభం ప్రదర్శించారని చెప్పాను. వారి సంకల్పం మరియు కృషిని చూసి నేను చాలా గర్వంగా మరియు సంతోషంగా ఉన్నాను.వారికి బైక్‌లు అందజేస్తానని అలాగే ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చాను. మొదటి దశగా, 13 బైక్‌లను అందజేస్తానన్న నా వాగ్దానం ఈ రోజు నెరవేరింది. మరియు అన్ని బైక్‌లను త్రీ వీలర్‌లుగా మారుస్తాము అని అలాగే వారికి ఇచ్చిన హామీ మేరకు త్వరలో ఇళ్లు కట్టిస్తానని తెలిపారు.ఈ ప్రత్యేకమైన రోజును మీ అందరితో పంచుకోవాలని నేను కోరుకున్నాను. మీ అందరి ఆశీస్సులు మరియు మద్దతు నాకు కావాలి” అని ట్వీట్ చేసారు .

Exit mobile version