Raghava Lawrence : రెండు రోజుల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ నటుడు మరియు కొరియోగ్రాఫర్ అయిన రాఘవలారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. సామాజిక సేవ చేయడంలో రాఘవ లారెన్స్ ఎప్పుడూ ముందుంటాడు. రాఘవ లారెన్స్ అనాథలు మరియు దివ్యాంగుల కోసం ఒక ట్రస్టును ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా వారికీ సాయం చేస్తున్నాడు. లారెన్స్ తాను చేయగలిగినంత సాయం ఎప్పుడూ చేస్తూ ఉంటాడు.తాను తెరకెక్కించే మరియు నటించే సినిమాలలో దివ్యాంగులను నటింపజేస్తూ వారిలోని ప్రతిభను నిత్యం ప్రోత్సహిస్తు వుంటారు. తాజాగా తమిళ పారంపర్య కళ అయిన మల్లర్ కంబం అనే విలువిద్యలో దివ్యాంగులను ప్రోత్సహిస్తున్నారు. ‘కై కొడుక్కుమ్ కై’ అనే దివ్యాంగుల బృందం ఈ సాహస కళను పలు వేదికలపై ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకుంటోంది.. కాగా ఈ బృందం సోమవారం రాఘవలారెన్స్ నేతృత్వంలో చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో మల్లర్ కంబం అనే సాహస కళను ప్రదర్శించింది.వీరి కళను అందరూ ప్రోత్సహించాల్సిందిగా రాఘవలారెన్స్ విజ్ఞప్తి చేశారు.వారికి తాను తగినంత సాయం చేస్తున్నానని తాను నటించే చిత్రాల్లో కూడా వారికీ అవకాశం ఇస్తానని ఆయన చెప్పారు.
ప్రతి ఒక్కరు తమ ఇళ్లల్లో జరిగే వేడుకల్లో ఇలాంటి టీమ్‌కు అవకాశం కల్పించి ప్రోత్సహించాలని ఆయన కోరారు. అలాగే తాను ఈ మల్లర్ కంబం కళ బృందంలోని ప్రతి ఒక్కరికీ ఒక బైక్‌ని ఇస్తానని తెలిపారు.. అలాగే తాను దివ్యాంగుల ఇతి వృత్తంతో ఒక సినిమా చేస్తున్నానని అందులో తానూ దివ్యాంగుడి పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. ఆ సినిమాకు వచ్చిన లాభాలతో వీరందరికి ఇళ్లు కట్టిస్తానని రాఘవ లారెన్స్ మాట ఇచ్చారు .ఇలా తాను ఇచ్చిన మాటను రాఘవ లారెన్స్ రెండు రోజులలో నిలబెట్టుకున్నారు.తాజాగా మల్లర్ కంబం ప్రదర్శించిన బృందానికి బైక్ లను అందజేస్తున్నట్లు తెలిపారు.”హాయ్ ఫ్రెండ్స్ మరియు ఫ్యాన్స్, రెండు రోజుల క్రితం ప్రెస్ మీట్‌లో శారీరక సామర్థ్యం ఉన్నా కూడా ఆ బృందం చాలా ధైర్యంగా మల్లరకంభం ప్రదర్శించారని చెప్పాను. వారి సంకల్పం మరియు కృషిని చూసి నేను చాలా గర్వంగా మరియు సంతోషంగా ఉన్నాను.వారికి బైక్‌లు అందజేస్తానని అలాగే ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చాను. మొదటి దశగా, 13 బైక్‌లను అందజేస్తానన్న నా వాగ్దానం ఈ రోజు నెరవేరింది. మరియు అన్ని బైక్‌లను త్రీ వీలర్‌లుగా మారుస్తాము అని అలాగే వారికి ఇచ్చిన హామీ మేరకు త్వరలో ఇళ్లు కట్టిస్తానని తెలిపారు.ఈ ప్రత్యేకమైన రోజును మీ అందరితో పంచుకోవాలని నేను కోరుకున్నాను. మీ అందరి ఆశీస్సులు మరియు మద్దతు నాకు కావాలి” అని ట్వీట్ చేసారు .
Also Read
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
- Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
Hi friends and fans, Two days ago in a press meet I mentioned that my physically abled boys performed Mallarkhambam so courageously. I’m extremely proud and happy to see their determination and hard work. I promised to provide them with bikes and build houses for them. As a first… pic.twitter.com/3iTO9spRIQ
— Raghava Lawrence (@offl_Lawrence) April 17, 2024
తాజావార్తలు
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
-
Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
-
Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!