NTV Telugu Site icon

Lavanya Tripati : పెళ్లి తర్వాత మెగా కోడలు ఇలా అయ్యిందేంటబ్బా.. గుర్తు పట్టలేనంతగా మారిపోయిందే..

Lavanya Tripati

Lavanya Tripati

హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇటీవల మెగా ఇంట కోడలు అయ్యింది.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.. పెళ్లి అయిన కొద్ది రోజులకే గుర్తు పట్టలేనంతగా మారిపోయింది.. లేటెస్ట్ లుక్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

వరుణ్ తేజ్ ను పెళ్లి కూడా చేసుకుని మెగా కోడలిగా ప్రమోషన్ పొందింది. వీరి పెళ్లి నవంబర్ 3న ఇటలీలోని టుస్కానీ నగరంలో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. రిసెప్షన్ ఎన్ – కన్వేన్షన్ హాల్ లో జరిగింది.. పెళ్లి తర్వాత వీరిద్దరూ పెళ్లి తర్వాత తెగ ఫోటో షూట్ లు చేస్తున్నారు.. సోషల్ మీడియాను నింపేస్తున్నారు.. నయా లుక్స్ లో మెరుస్తున్నారు. వెడ్డింగ్ తర్వాత ఇద్దరు చేసిన ఫొటోషూట్ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా లావణ్య మాత్రం షాకింగ్ లుక్ లో మెరిసింది…

పెళ్లైన కొద్దిరోజులకే లావణ్య అందం మారిపోయినట్టుగా లేటెస్ట్ లుక్ ను చూస్తే అర్థమవుతోంది. హెవీ మేకప్ వల్లనో.. లేదంటే ఏదైనా ఫిల్టర్ వాడటం వల్లనో తెలియదు కానీ సడెన్ గా చూస్తే లావణ్య అని కనిపెట్టడం కష్టమే.. పింక్ లిప్స్, బ్లూ టైట్ ఫిట్ లో మైండ్ బ్లోయింగ్ గా ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం వీడియో ను మాత్రమే పంచుకుంది.. ఇంస్టాగ్రామ్ వేధికగా తనను పెళ్లి కూతురుగా చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతూ వీడియోను పోస్ట్ చేసింది..

 

Show comments