తనకు ప్రాణహాని ఉందని లావణ్య పేర్కొంది. తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు ప్రాణ హాని ఉందని.. బతికి ఉంటానో లేదో తెలియదని తెలిపింది. మస్తాన్ సాయి, వాళ్ళ పేరెంట్స్ నన్ను చంపేస్తారని వాపోయింది.. గడప దాటలంటే భయపడుతున్నట్లు తెలిపింది.. వైరల్ అయిన వీడియోపై స్పందించింది. తాను కాల్ మాట్లాడుతున్నప్పుడు మస్తాన్ సాయి రికార్డ్ చేశాడని.. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో, ఆడియో కూడా అదే అంది.. చాలా మంది యువతుల వీడియోలు ఎక్కడ అమ్ముతున్నాడో పోలీసులు తేల్చాలని తెలిపింది. తాను ఒక్కటే మస్తాన్ సాయిపై పోరాటం చేస్తున్నానని.. ఈ పోరాటంలో తాను చనిపోవచ్చని చెప్పుకొచ్చింది.
READ MORE: Vallabhaneni Vamsi Arrest: వల్లభనేని వంశీ అరెస్ట్.. తదుపరి చర్యలపై మాజీ ఏఏజీ పొన్నవోలు సమాలోచనలు..
“నన్ను బెదిరిస్తున్నారు. నాకు థ్రెట్ కాల్స్ కూడా వస్తున్నాయి. ఇక్కడితో ఇక ఆపాలి అంటున్నారు. లేదా చంపేస్తున్నామంటున్నారు. రాజ్ తరుణ్ ఉండగా.. ఈ అమ్మాయి బయటకు రాదని వాళ్ల ధైర్యం. రాజ్ తరుణ్ సినిమాకు చెందిన వ్యక్తి కాబట్టి.. అతడు సినిమాకు సంబంధించిన వ్యక్తి.. అతని కెరియర్ కోసం.. లేదా పరువు కోసం ఉంటాడు.. అలాంటి వ్యక్తి ఉన్నప్పుడు ఈ అమ్మాయి బయటకు రాదు. అని నన్ను చాలా టార్గెట్ చేశారు. కానీ.. రాజ్ తరుణ్ ఉన్నాకూడా నేను నా కోసం స్టాండ్ తీసుకుని బయటకు వచ్చి ఫైట్ చేశాను. ఇప్పటికీ కూడా కోల్పోయింది నేను రాజ్ తరుణ్ మాత్రమే.. ఏడు, ఎనిమిది నెలల నుంచి రాజ్ తరుణ్ వర్క్ కూడా చేసుకోవడం లేదు. దయ చేసి లావణ్య, రాజ్ తరుణ్ పక్కన పెట్టి అతడు వీడియోస్ ఎందుకు తీస్తున్నాడు అనే దానిపై దృష్టి పెట్టాలి.” అని లావణ్య పేర్కొంది.