Lava Blaze Dragon 5G Launch Date in India and Price: భారత్‌కు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘లావా’ మరో స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. ‘లావా బ్లేజ్ డ్రాగన్’ ఫోన్ జులై 25న లాంచ్ అవుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ నెలలోనే లావా బ్లేజ్ అమోలెడ్2 ను కూడా కంపెనీ లాంచ్ చేయబోతోంది. అయితే కంపెనీ రిలీజ్ డేట్‌ను ఇంకా వెల్లడించలేదు. ఇక లావా బ్లేజ్ డ్రాగన్ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన ప్రాసెసర్, బిగ్ బ్యాటరీ, 64 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తోంది. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Lava Blaze Dragon 5G SPecs:
టిప్‌స్టర్‌ల ప్రకారం.. లావా బ్లేజ్ డ్రాగన్ ఫోన్ 6.67 ఇంచెస్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో లాంచ్ కావొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్ 15, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ ఉండనుంది. ఈ ఫోన్‌లో మీరు స్టాక్ ఆండ్రాయిడ్ అనుభవాన్ని పొందుతారు.
Also Read: Free Gold-Saree Gift: బంగారం, చీర ఫ్రీ.. ఎందుకు, ఎక్కడో తెలుసా?
Lava Blaze Dragon 5G Camera, Battery:
లావా బ్లేజ్ డ్రాగన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ లెన్స్ 50 ఎంపీ, 8 ఎంపీ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీతో రానుండగా.. 18W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. 4జీబీ ర్యామ్ + 128 4జీబీ స్టోరేజ్, 64జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్‌లో లాంచ్ కానుంది. అమెజాన్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. 11 వేల ధర ప్రారంభ ధరతో ఈ ఫోన్ లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ త్వరలో తెలియరానున్నాయి.
